ఎమిరేట్స్ ప్రయాణికులకు రూ.4.7 లక్షలు | Emirates offers EK521 passengers $7,000 in financial assistance | Sakshi
Sakshi News home page

ఎమిరేట్స్ ప్రయాణికులకు రూ.4.7 లక్షలు

Published Fri, Aug 12 2016 11:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు రూ.4.7 లక్షలు

ఎమిరేట్స్ ప్రయాణికులకు రూ.4.7 లక్షలు

దుబాయ్: ఇటీవలి ఎమిరేట్స్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న 282 ప్రయాణికులు.. ఒక్కొక్కరు 7 వేల డాలర్లు (4,70,000) చొప్పున పరిహారంగా అందుకోనున్నారు. ఈ విషయాన్ని విమానయాన సంస్థ తెలిపింది. వీరిలో అత్యధికులు కేరళవాసులే. ఈ విమానంలోనే తన భార్య ఇద్దరు పిల్లలతో ప్రయాణించిన వ్యక్తికి ఎమిరేట్స్ సంస్థ ఈమెయిల్ సందేశం పంపింది.

‘మంగళవారం సాయంత్రమే మెయిల్ వచ్చింది. అయితే నేను ఆలస్యంగా గమనించా’ అని అతను స్థానిక వార్తాపత్రికకు వెల్లడించారు. ఆగస్టు 3న తిరువనంతపురం నుంచి దుబాయ్ బయల్దేరిన విమానం ల్యాండింగ్ సమయంలో నేలను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రయాణికులతోపాటు సిబ్బందిని సురక్షితంగా రక్షించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement