తిరువనంతపురం: పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన వేడుక. అందుకే ఈ వేడుకను ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా జరుపుకునేందుకు చాలా మంది యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు. ఫొటో సెషన్లు, సంగీత్‌లు, వెడ్డింగ్ కార్డులు.. ఇలా ప్రతిది ఆకట్టుకునేలా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్ తన వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరువనంతపురానికి చెందిన విథున్ అనే కెమిస్ట్రీ టీచర్‌కు డిసెంబర్ 14న సూర్య అనే వ్యక్తితో పెళ్లి జరగనుంది. కెమిస్ట్రీ టీచర్ అయిన విథున్ తన పెళ్లి పత్రికను కూడా ఆమె బోధిస్తున్న సబ్జెక్ట్‌తో ముడిపడి ఉండేలా రూపొందించారు. ఈ వెడ్డింగ్ కార్డును ఆర్గానిక్ కెమిస్ర్టీలోని రసాయనబంధాలను గుర్తుకు తెచ్చేలా రూపొందించారు. అందులో లవ్(LOVE) అనే పదాలను కూడా అందంగా పొందుపర్చారు. వధువరుల పేర్లు కూడా కెమిస్ట్రీ లుక్‌లోనే డిజైన్ చేశారు. మరి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లిని రియాక్షన్(చర్య)గా, కళ్యాణ వేదికను ల్యాబోరేటరిగా పేర్కొన్నారు. విథున్ సృజనాత్మకతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
శుభాకాంక్షలు తెలిపిన శశిథరూర్..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వెడ్డింగ్ కార్డును కార్తీక్ వినోబా అనే వ్యక్తి కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. మీ నియోజకవర్గంలోని ఓ కెమిస్ట్రీ టీచర్ వెడ్డింగ్ కార్డు ఇది అని కార్తీక్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై చమత్కారంగా స్పందించిన శశిథరూర్ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
Wishing them all the best for a happy married life! May the chemistry between them always sparkle, the physics feature more light than heat, and the biology result in bountiful offspring....! https://t.co/Y6aYMjFsPi
— Shashi Tharoor (@ShashiTharoor) 13 December 2018
Comments
Please login to add a commentAdd a comment