PC: INSIDE SPORT
ఆస్ట్రేలియాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఇప్పడు దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్దమైంది. స్వదేశంలో ప్రోటీస్ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు భారత్ ఆడనుంది. బుధవారం(సెప్టెంబర్ 28) తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది
ఈ క్రమంలో ప్రోటీస్‌తో తొలి టీ20లో పాల్గొనేందుకు తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టుకు నిరసన సెగ తగిలింది. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. భారత క్రికెటర్లు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే సంజూ సంజూ అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
కాగా సంజూకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతడి సొంత రాష్ట్రం కేరళలో అయితే డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను భారత కెప్టెన్ రోహిత్ పాటు చాహల్, అశ్విన్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
కాగా టీ20 ప్రపంచకప్‌కు పంత్ స్థానంలో సంజూను ఎంపిక చేసి ఉంటే బాగుండేది అని అతడు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా అతడి అభిమానులు తిరువనంతపురంలో జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ20 సందర్భంగా బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ముందుగానే నిర్ణయించకున్నారు.
Sanju Samson is not just a player he is an emotion for all of us. pic.twitter.com/QT4alXGLT6
— Rockstar MK (@RockstarMK11) September 26, 2022
స్వదేశంలో న్యూజిలాండ్-ఏ తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భారత-ఏ జట్టు కెప్టెన్‌గా శాంసన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ సొంతం చేసుకుంది.
చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు
Comments
Please login to add a commentAdd a comment