
సంజూ శామ్సన్ ఇంట్లో చోరీ
ట్రోఫీలన్నీ పట్టుకెళ్లిన దొంగలు
తిరువనంతపురం: రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు సంజూ శామ్సన్ ఇంట్లో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో శామ్సన్ తన కెరీర్‌లో సాధించిన ట్రోఫీలు, సావనీర్లను కోల్పోయాడు. ఈమేరకు అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరువనంతపురానికి సమీపంలో ఉన్న తీర ప్రాంతం విజింజమ్‌లో వీరు నివాసముంటున్నారు. దొంగతనం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. ట్రోఫీలు, షీల్డులను దోచుకెళ్లడంతోపాటు దొంగలు కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.