
తిరువంతపురం: కేరళలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో 22వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఈ నెల(జూలై) 31, ఆగస్టు 1న రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలోనే 22వేల కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 4,03,840 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.
కాగా, కేరళకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించనుంది. కేరళలో కరోనా కేసులు రోజూరోజుకు పెరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహాయం చేస్తుదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.