
తిరువనంతపురం: బీజేపీకి మళ్లీ అధికారమిస్తే దేశాన్ని ‘హిం దూ పాకిస్తాన్’గా మారుస్తుందంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేసి కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుంది. దేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది. అప్పుడు మైనారిటీలకు హక్కులుండవు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి మహామహులు సాగించిన స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలకు వ్యతిరేకంగా దేశం ‘హిందూపాకిస్తాన్’గా మారుతుంది’ అని తిరువనంతపురంలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment