
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం : భారత్-వెస్టిండీస్ మధ్య చివరిదైన ఐదో వన్డే టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉందని కేరళ క్రికెట్ ఆసోసియేషన్(కేసీఏ) తెలిపింది. రేపు(గురువారం) తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా కేసీఏ విద్యార్థులకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో టికెట్లు బాగా అమ్ముడుపోతున్నాయి. 40వేల సీటింగ్ కెపాసిటీ గల ఈ మైదానంలో మంగళవారానికే 30వేల టికెట్లు అమ్ముడుపోయాయని, మ్యాచ్ ప్రారంభమయ్యే రోజువరకు అన్ని టికెట్లు అమ్ముడుపోతాయని కేసీఏ అధికారులు పేర్కొన్నారు. (చదవండి : ఆటలో ‘అరటిపండు’!)
టికెట్ల అమ్మకాల ద్వారా రూ.3 కోట్లు ఆదాయం వచ్చిందని, విద్యార్థులు ఆఫర్‌లో టికెట్లు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఐడీకార్డులు తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే ఇరు జట్లు అక్కడి చేరుకోని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇది కూడా బ్యాటింగ్ పిచ్ కావడంతో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో రోహిత్, రాయుడులు సెంచరీలతో చెలరేగి భారత్‌కు అతిపెద్ద విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. (చదవండి: భారత క్రికెట్ ప్రమాదంలో పడింది!)
Comments
Please login to add a commentAdd a comment