
సునందకు తీవ్ర అనారోగ్యం!
సునంద పుష్కర్‌కు కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. మాజీ దౌత్యాధికారి, శశిథరూర్ సన్నిహితుడు అయిన టి.పి.శ్రీనివాసన్ శుక్రవారం రాత్రి తిరువనంతపురంలో మీడియాతో పేర్కొన్నారు.
తిరువనంతపురం: సునందపుష్కర్‌కు కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. మాజీ దౌత్యాధికారి, శశిథరూర్ సన్నిహితుడు అయిన టి.పి.శ్రీనివాసన్ శుక్రవారం రాత్రి తిరువనంతపురంలో మీడియాతో పేర్కొన్నారు. సునంద అనారోగ్యం గురించి థరూర్ తనకు చెప్పారని.. ఆమె ఇటీవలే ఫ్రాన్స్‌లో చికిత్స పొందారని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే.. సునందకు సిస్టిక్ లూపస్ ఎరితెమాటోసస్ అనే వ్యాధి ఉన్నట్లు గుర్తించటం జరిగిందని.. ఈ వ్యాధికి సంపూర్ణ చికిత్స లేదని అభిజ్ఞ వర్గాలు చెప్పినట్లు ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. తిరువనంతపురంలోని ఒక ఆస్పత్రిలో ఆమె వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారని, ఈ నెల 20వ తేదీన కూడా ఆమె ఆస్పత్రికి రావాల్సి ఉందని ఆ సంస్థ చెప్పింది.