
బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి..!
బీజేపీ పార్టీ కార్యాలయంపై బాంబులు విసిరిన ఘటన తిరువనంతపురంలో కలకలం రేపింది.
తిరువనంతపురంః బీజేపీ పార్టీ కార్యాలయంపై బాంబులు విసిరిన ఘటన తిరువనంతపురంలో కలకలం రేపింది. కార్యాలయం ప్రధాన ద్వారంపైకి గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో ముడి బాంబును విసరడంతో ద్వారానికి ఉన్న అద్దాల తలుపులు దెబ్బతిన్నాయి. అయితే బాంబు దాడిలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు నిర్ధారించారు.
దుండగులు బాంబు విసిరిన సమయానికి బీజేపీ కార్యాలయంలోని పై అంతస్తులో నలుగురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని, అయితే ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ స్పర్జన్ కుమార్ తెలిపారు. ప్రధానద్వారం పైకి ముడి బాంబును విసరడంతో కేవలం తలుపు అద్దాలు మాత్రం పగిలాయని ఆయన పేర్కొన్నారు.