Kerala Woman Was Found Living Secretly After 11 Years | 11 ఏళ్ల క్రితం తప్పిపోయిందనుకుంటే - Sakshi
Sakshi News home page

11 ఏళ్ల క్రితం తప్పిపోయింది.. పక్కనే నివసిస్తున్నా ఎవరూ గుర్తించలేదు!

Published Thu, Jun 10 2021 1:49 PM | Last Updated on Thu, Jun 10 2021 3:02 PM

Kerala Woman Was Found Living Secretly After 11 Years - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: కేరలోని పాలక్కాడ్‌లోని అయలూర్ గ్రామంలో 11 ఏళ్ల క్రితం సజిత అనే ఓ మహిళ తప్పిపోయింది. అయితే ఆమె తన తల్లిదండ్రులకు కేవలం 500 మీటర్ల దూరంలో నివసిస్తున్నట్లు ఇటీవల గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. సజిత తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రేమించి వ్యక్తి కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు, పోలీసులు వెతకని చోటు లేదని అన్నారు. అయితే మూడు నెలల క్రితం అలిన్చువటిల్ రెహ్మాన్ కూడా (34) అకస్మాత్తుగా తప్పిపోడంతో.. అతని కుటుంబం ఈ ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.

కాగా మంగళవారం రెహ్మాన్‌ను అతని అన్న బషీర్‌ అనుకోకుండా వేరో గ్రామంలో కలిశాడు. దీంతో రెహ్మాన్‌, సజిత వేరే గ్రామంలో అద్దెకుంటున్నట్టు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. పోలీసులు ఈ జంటను స్థానిక కోర్టులో హాజరుపరచగా.. రెహ్మాన్‌తో కలిసి ఉంటానని సజిత చెప్పడంతో వారు కలిసి జీవించడానికి కోర్టు అనుమతించింది. ఇక ఈ ఘటనపై రెహ్మాన్‌ అన్న బషీర్‌ మాట్లాడుతూ.. హౌస్‌ పెయింటర్‌గా పనిచేసే రెహ్మాన్‌కు ప్రత్యేక గది ఉందని తెలిపాడు. అయితే అతడు ఆ గదిలోకి ఎవరూ రాకుండా తాళం వేసి ఉంచే వాడని వెల్లడించాడు.

(చదవండి: వధువుకు వింత బహుమతులు.. వరుడుని ఉతకడానికేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement