కాంగ్రెస్‌ విజయంపై శశిథరూర్‌ వ్యాఖ్యలు | Thiruvananthapuram Lok Sabha Seat Shashi Tharoor | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ విజయంపై శశిథరూర్‌ వ్యాఖ్యలు

Published Tue, Jun 4 2024 11:40 AM | Last Updated on Tue, Jun 4 2024 11:40 AM

Thiruvananthapuram Lok Sabha Seat Shashi Tharoor

లోక్‌సభ ఎన్నికల యుద్ధం తుది దశకు చేరుకుంది. కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ వెనుకంజలో ఉన్నారు. తొలి ట్రెండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ముందున్నారు. ఈ నేపధ్యంలో శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఓటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఎలాంటి వాదనలకు, చర్చలకు తావులేదు. విజయంపై నమ్మకంతో ఉన్నాం. ఏప్రిల్ 26 నుండి మా అంచనాలు పెరిగాయి. ఎందుకంటే  ఓటర్లు ఓటు వేశాక, ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల​కు తరలించాక, ఎటువంటి వాదనలకు లేదా చర్చలకు ఆస్కారం ఉండదు. ఇక క్రాస్ ఓటింగ్ విషయానికొస్తే దానివల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ లాభం కలగలేదు. గత ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరగలేదు. ఈసారి క్రాస్‌ ఓటింగ్‌ జరగాలని మేము ఆశించ లేదు. అయితే మేము గెలుస్తున్నామనే నమ్మకంతో ఉన్నాం’ అని శశిధరూర్‌ మీడియాతో అన్నారు.  

తిరువనంతపురంను గతంలో త్రివేండ్రం అని పిలిచేవారు. ఇది కేరళ రాజధాని. రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. తిరువనంతపురం కేరళలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా పేరొందింది. ఈ నగరం దశాబ్దాలుగా వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించింది. ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్ 2009 నుంచి తిరువనంతపురం ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement