న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీ ఎస్‌ఈ) 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 98.87 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు సీబీఎస్‌ఈ అధికారులు వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచే యి సాధించారని, వీరి ఉత్తీర్ణతా శాతం 99.06గా ఉందని తెలిపారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 98.74గా ఉందన్నారు. కాగా, దేశం మొత్తంలో తిరువనంతపురం రీజియన్ 99.96 శాతంతో అత్యధిక మార్కులు సాధించి ప్రథమస్థానం కైవసం చేసుకుందని పేర్కొన్నారు.
ఈ నెల 19న విడుదలైన ఫలితాల్లో చెన్నై రీజియన్ కూడా సత్తా చాటిందన్నారు. మొత్తం 1, 32,7250 మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారని, గత ఏడాదితో పోల్చుకుంటే 5.51 శాతం ఎక్కువని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హాజ రైన విద్యార్థుల్లో 99.89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
సీబీఎస్‌ఈ టెన్‌త ఫలితాల్లో బాలికలదే పైచేయి
Published Wed, May 21 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement