Pass percentage
-
శతశాతమే 'లక్ష్యం'
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలి తాలు సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠ శాల విద్య డైరెక్టరేట్ కార్యా లయం ఈ మేరకు జిల్లా అధికారులకు దిశానిర్దేం చేస్తూ..‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తెచ్చింది. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా చూడటం దీని ఉద్దేశం. ఎన్నిక లు కూడా ముగియడంతో ఉన్నత పాఠశాలల ఉపా ధ్యాయులు టెన్త్ విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలని డీఎస్ ఈ సూచించింది. వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక బోధన చేపట్టాలని ఆదేశించింది. వీలైనంత త్వర గా సిల బస్ పూర్తి చేసి, జనవరిలో పునశ్చరణకు వెళ్లాలని పేర్కొంది. లక్ష్యం సాధించిన పాఠశాలల కు అవార్డు లిచ్చే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తు న్నారు. టెన్త్ పరీక్షలు మార్చి, ఏప్రిల్ నెల లో జరుగుతాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి, పరీక్షలకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై మరింత దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లపైనే..: రాష్ట్ర ప్రభుత్వ పాఠశా లలు, స్థానిక సంస్థల పాఠశాలల్లో టెన్త్ ఫలితాలు తక్కువగా నమోదవుతున్నాయి. 2023లో జెడ్పీ పా ఠశాలల నుంచి 1,39,922 మంది టెన్త్ పరీక్షకు హా జరైతే, 1,10,738 మంది మాత్రమే ఉత్తీర్ణుల య్యా రు. అంటే 79.14 శాతం రిజల్ట్ నమోదైంది. ప్రభు త్వ స్కూళ్లలో 21,495 మంది పరీక్ష రాస్తే, 15,561 (72.39 శాతం) మంది పాసయ్యారు. ప్రభుత్వ రెసి డెన్షియల్ స్కూళ్లలో 98 శాతం, గురుకు లాల్లో 95 శాతం ఫలితాలొచ్చాయి. ఇది ప్రైవేటు పాఠశాలక న్నా ఎక్కువ. అయితే ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లల్లో ఫలితాలపై ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ సబ్జెక్టులపైనే దృష్టి: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎక్కు వగా మేథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సబ్జెక్టులపై ప్రత్యేక బోధనకు ప్లాన్ చేశారు. టెన్త్ విద్యార్థులకు ఉదయం గంట అదనంగా క్లాసులు తీసుకుంటారు. వారంలో 3 సబ్జెక్టులు రోజుకు ఒకటి చొప్పున చేపట్టాలని నిర్ణయించారు. ఇది కూడా సంబంధిత సబ్జెక్టులో కఠినంగా ఉండే చాప్టర్లను ఎంపిక చేసుకోవాలని పాఠశాలలకు సూచిస్తున్నారు. జనవరి ఆఖరివారం లేదా ఫిబ్రవరి నుంచి సాయంత్రం కూడా అదనంగా మరో గంట ప్రత్యేక బోధన చేపట్టాలని నిర్ణ యించారు. దీనివల్ల టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమనేది అధికారుల ఆలోచన. -
CBSE 10th Result 2022: సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికలు 95.21 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 93.80 శాతం మంది పాసయ్యారు. బాలికల్లో దియా నామ్‌దేవ్, బాలురలో మయాంక్ యాదవ్ నేషనల్ టాపర్స్‌గా నిలిచారు. వీరిద్దరూ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుని చదివా షామ్లీ జిల్లాకు చెందిన దియా నామ్‌దేవ్.. స్థానిక స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాను టాపర్‌గా నిలిచానని దియా నామ్‌దేవ్ తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉంటాను. నేను ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు చదువుకున్నాను. కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకుని చదవడం వల్ల టాపర్‌గా నిలిచాన’ని అన్నారు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన మయాంక్ యాదవ్ కూడా 100 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచాడు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు తెచ్చుకుని సత్తా చాటాడు. టాపర్‌గా నిలవడం పట్ల మయాంక్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. త్రివేండ్రం టాప్.. గువాహటి లాస్ట్ సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో త్రివేండ్రం ముందు వరుసలో నిలిచింది. త్రివేండ్రంలో అత్యధికంగా 99.68 శాతం ఉత్తీర్ణత నమోదయింది. గువాహటి 82.23 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. ఢిల్లీలో 86.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తూర్పు ఢిల్లీలో 86.96 శాతం, పశ్చిమఢిల్లీలో 85.94 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ( కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటీషన్.. పోలీసుల అదుపులో ఒకరు) -
ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. బాలురకంటే బాలికలే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి 4 నుంచి 21 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాం చంద్రన్, బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. ద్వితీయ సంవత్సరంలో 75.15% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 62.10% మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ద్వితీయ సంవత్సరంలో (జనరల్, వొకేషనల్) రెగ్యులర్ విద్యార్థులు 68.86% మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ తీసేసి జనరల్‌లోనే చూస్తే 69.61% మంది ఉత్తీ ర్ణులయ్యారు. ఫస్టియర్‌లోనూ 67.47% మంది బాలికలు, 52.30 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ప్రథమ సంవత్స రంలో 60.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ స్థానంలో ఆసిఫాబాద్, మేడ్చల్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి (వొకేషనల్ రెగ్యులర్ ప్రైవేటు మినహా) 4,44,708 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 2,82,208 మంది ఉత్తీర్ణులయ్యారు. అం దులో ఆసిఫాబాద్ జిల్లా 80% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ద్వితీయ సంవ త్సర జనరల్, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులనే తీసుకుంటే 4,11,631 మంది పరీక్షలకు హాజరు కాగా 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 80% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రెండు కేటగిరీల్లోనూ మెదక్ చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలకు సంబంధించిన మరిన్ని వివరాలు.. ప్రథమ సంవత్సరంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4,80,555. అందులో జనరల్ విద్యార్థులు 4,31,358 మంది, వొకేషనల్ విద్యార్థులు 49,197 మంది ఉన్నారు. ప్రథమ సంవత్సరంలో 2,44,105 మంది బాలికలు పరీక్షలకు హాజరవగా బాలురు 2,36,450 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరంలో మొత్తంగా ఉత్తీర్ణులైన వారు 2,88,383 (60.01 శాతం) మంది ఉన్నారు. వారిలో జనరల్ విద్యార్థులు 2,63,463 మంది. వొకేషనల్ విద్యార్థులు 24,920 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 1,64,704 మంది (67.47 శాతం) ఉత్తీర్ణులవగా 1,23,679 మంది (52.30 శాతం) బాలురు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో గ్రేడ్లవారీగా ఉత్తీర్ణులు.. ద్వితీయ సంవత్సరంలో.. ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ రెగ్యులర్ విద్యార్థులు, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు 4,11,631 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో జనరల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 3,74,492 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 37,139 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్ ప్రైవేటు విద్యార్థులు 70,216 మంది, వొకేషనల్‌లో ప్రైవేటు విద్యార్థులు 3,660 మంది పరీక్షలకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరంలో పరీక్షలకు మొత్తంగా జనరల్, వొకేషనల్ రెగ్యులర్‌లో 2,13,121 మంది బాలికలు హాజరవగా, 1,98,510 మంది బాలురు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన మొత్తం ద్వితీయ సంవత్సర జనరల్, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థుల్లో 2,83,462 మంది (68.86 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో జనరల్ రెగ్యులర్ విద్యార్థులు 2,60,703 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 22,759 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్ ప్రైవేటు విద్యార్థులు 21,505 మంది, వొకేషనల్ ప్రైవేటు విద్యార్థులు 1,713 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్ బాలికల్లో 1,60,171 మంది (75.15 శాతం) ఉత్తీర్ణులుకాగా పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్ బాలురులో 1,23,291 మంది (62.10 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో అత్యధికంగా ఉత్తీర్ణత ఈసారి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా గ్రూపులతో పోలిస్తే అత్యధికంగా ఎంపీసీలో 67.95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు బోర్డు పేర్కొంది. ఆ తరువాత బైపీపీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. సీఈసీలో చాలా తక్కువ శాతం మంది విద్యార్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర హాజరైన విద్యార్థులు వివరాలు.. పెరుగుతున్న ఉత్తీర్ణత శాతం ఇంటర్లో ఉత్తీర్ణత శాతం ఏటేటాæ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఉత్తీర్ణత శాతంలో పెరుగుదల నమోదైంది. గతేడాది మినహాయిస్తే గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014 వార్షిక పరీక్షల్లో 60.14 శాతం ఉన్న ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణత ప్రస్తుతం 68.86 శాతానికి పెరిగింది. రెగ్యులర్ విద్యార్థుల్లో మాత్రమే చూస్తే 69.61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలోనూ గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. 2014లో 52.65 శాతం ఉత్తీర్ణత నమోదవగా ఈసారి 61.07 శాతానికి పెరిగింది. -
ఫలితాలు ఓకే...ప్రమాణాలేవి?
సాక్షి, అమరావతి:పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఏటేటా అనూహ్యంగా పెరుగుతోంది. ఆమేరకు విద్యార్థుల్లో సబ్జెక్టులపై పట్టు పెరగడంలేదు. ప్రమాణాలూ అంతంత మాత్రమే. పాస్ పర్సంటేజీ పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రమాణాల అభివృద్ధిపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, బోధకుల్లోనూ కనిపించడం లేదు. 1998–99 సంవత్సరంలో టెన్త్‌లో పాస్ పర్సంటేజీ 52.67 శాతం మాత్రమే ఉండగా అది నేడు 95 శాతం వరకు చేరుకోవడం గమనించదగ్గ అంశం. నాలుగైదు శాతం తేడాలో ప్రతి ఏటా ఇదేరకమైన ఉత్తీర్ణత శాతాలు నమోదు అవుతున్నాయి. తాజాగా మంగళవారం విడుదలయిన టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత 94.88 శాతంగా నమోదైంది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల ఆవిర్భావంతోనే ఈ మార్పు 1998కి ముందు వరకు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం కచ్చితమైన నియమ, నిబంధనలను అమలు చేసేది. విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు వారిలో ఏమేరకు విద్యాప్రమాణాలు అభివృద్ధి చెందాయనే అంశాలు తెలుసుకునేందుకు మూల్యాంకనం చేయడంలోనూ అంతే కచ్చితమైన విధానాలు పాటిం చేది. 1998–99 నుంచి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నసమయంలో ప్రయివేటు స్కూళ్లకు, కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేయడం ప్రారంభించినప్పటినుంచి ఆనారోగ్యకర వాతావరణం ఏర్పడింది. విద్య వ్యాపారంగా మారింది. ప్రయివేటు కార్పొరేట్ సంస్థలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచి చూపించుకోవడం ద్వారా ప్రవేశాలను గణనీయంగా పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం వారు అడ్డదారులు తొక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. లక్ష్యాల నిర్దేశంతో జిల్లాల మధ్య పోటాపోటీ సమీక్షల సందర్భంగా సీఎంనుంచి ఉన్నతాధికారుల వరకు ఉత్తీర్ణత శాతంపైనే ఎక్కువ దృష్టి సారించి వాటిని పెంచేలా అధికారులపై ఎత్తిడి పెంచారు. దీంతో జిల్లా మధ్య పోటీ పెరిగింది. ఇది మాస్ కాపీయింగ్‌కు, ఇతర అడ్డదారులకు దారితీసింది. 1998–99లో 52.67గా ఉన్న టెన్త్ ఉత్తీర్ణత శాతం 2003–04 నాటికి ఒక్కసారిగా 80.55కి పెరిగింది. అంటే 27.88 శాతం పెరిగిందన్న మాట. ఈ పెరుగుదల ప్రయివేటు స్కూళ్లలోనే కనిపించింది. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఉత్తీర్ణత శాతం 50నుంచి 55 శాతానికే పరిమితమైంది. దీంతో విద్యార్ధులు ప్రయివేటు స్కూళ్లవైపు ఆకర్శితులవుతూ వచ్చారు. అక్కడ అర్హులైన టీచర్లు లేకున్నా... సరైన బోధన, దానికి తగ్గ సదుపాయాలు లేకున్నా, ప్రమాణాలతో పనిలేకుండా బట్టీ పద్దతులకు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన కేంద్రాల్లో తమ విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా పైరవీలు చేసేవారు. మాస్ కాపీయింగ్ తదితర మార్గాల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటూ పోయారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ అదే సంస్కృతి... ప్రయివేటు స్కూళ్లతో సమానంగా పరుగులు పెట్టేందుకు ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే వాతావరణం తప్పనిసరైంది. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కలెక్టర్లు, డీఈఓలు, విద్యాధికారులు పరీక్షల సమయంలో, మూల్యాంకనం వేళ ఒకింత వెసులుబాటు కల్పిస్తూ సాధ్యమైనంత మేర ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో సంపూర్ణత లేకున్నా పాస్‌మార్కులు వేసే సంప్రదాయానికి తెరతీశారు. మాస్ కాపీయింగ్ కూడా పెరిగింది. దీంతో ఉత్తీర్ణత శాతం అమాంతం పెరిగిపోతూ వస్తోంది. జంబ్లింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినా పరిస్థితిలో మార్పులేదు. చివరకు మార్కుల పరుగులో విద్యార్ధులపై ఒత్తిడి పెరిగి అనారోగ్యకర వాతావరణం ఏర్పడడంతో ప్రభుత్వం మార్కులు తీసేసి గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అయినా గ్రేడ్లతోనూ కార్పొరేట్ సంస్థలు ప్రచారాన్ని చేసుకుంటున్నాయి. సీసీఈ విధానంతో మరింతగా... విద్యాహక్కు చట్టం ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు దరిమిలా మూడేళ్ల నుంచి ఆ విధానంలో పరీక్షలు పెడుతున్నారు. అంతర్గత ప్రాజెక్టులు, ఇతర అంశాలకు 20 మార్కులు వేస్తూ, పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అయితే అంతర్గత మార్కుల కేటాయింపులో ప్రయివేటు పాఠశాలలు వందకు వందశాతం తమపిల్లలకు వేయిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. పెరిగిన డిమాండ్–చుక్కల్లో ఫీజులు టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడంతో ఆ తదుపరి ఇంటర్మీడియెట్ విద్యకు డిమాండ్ తలెత్తుతోంది. ఇదే అదునుగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు దీన్ని ఆసరా చేసుకొని కాలేజీ ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కొంతమేర రాయితీ ఇస్తూ తక్కిన వారినుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,361 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు 1143. తక్కినవన్నీ ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలే. టెన్త్‌లో ఉత్తీర్ణులు అవుతున్న విద్యార్ధుల సంఖ్య 2018–19లోనే చూసుకుంటే దాదాపు 6 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో కేవలం లక్ష సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. తక్కిన వారంతా ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్దులు 9.30 లక్షల మంది ఉండగా వీరిలో 2.30 లక్షల మంది ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా తక్కిన 7 లక్షల మందీ ప్రయివేటు కాలేజీల్లో చేరుతున్నారు. అప్పట్లో ఫస్ట్ క్లాస్ అంటే అదో పండగే... ఒకప్పుడు 60 నుంచి 70 శాతం మార్కులు సాధించడమంటే చాలా గొప్పవిషయంగా ఉండేది. ఫస్టుక్లాస్ వచ్చిందటే అదో పండగ. కానీ ఇప్పుడు 60 శాతం మార్కులు అంటే చాలా చిన్నచూపుగా మారింది. 80– 90కి పైగా మార్కులు సాధించిన వారే తెలివైన వారన్న ముద్రపడింది. విద్యార్ధుల్లో ప్రమాణాలతో సంబంధం లేకుండా మార్కులకోసం వక్రమార్గాల్లో పయనిస్తున్నాయి. ఇపుడు 70 నుంచి 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా టెన్త్‌లో ఉత్తీర్ణత శాతాలుఇలా ఉన్నాయి. -
పదిలో మూడో స్థానం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం రెండు స్థానాలు ముందుకు వెళ్లింది. ఫలితంగా ఈ ఏడాది పది ఫలితాల్లో జిల్లా 3 వ స్థానంలో నిలిచింది. 10 జీపీఏల సాధనలో జిల్లా విద్యార్థులు 3,283 మంది సాధించారు. సర్కారు బడుల ఉత్తీర్ణత శాతం, 10 జీపీఏల్లో మెరుగైన ఫలితాలు లభించాయి. మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 97.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పబ్లిక్ పరీక్షల సమయంలో ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు, పలు పాఠశాలల్లో టీచర్ల కొరత ఉన్నప్పటికీ మెరుగైన ఫలితాలు లభించాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 1.05 శాతం ఉత్తీర్ణత పెరిగింది. గత ఏడాది జిల్లాలో 96.36 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 97.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన డీఈఓ పాండురంగస్వామిని కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీషా అభినందించారు. బాల, బాలికల పోటీ.... కొన్నేళ్లుగా పది ఫలితాల్లో బాలికల హావా కొనసాగుతూనే వస్తోంది. ఈ సారి విడుదలైన ఫలితాల్లోనూ జిల్లాలో బాలికలే ముందంజలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 51,205 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో బాలురు 27,217 మంది, బాలికలు 25,352 మంది ఉన్నారు. వారిలో బాలురు 26,442 మంది, బాలికలు 24,763 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 97.15 శాతం, బాలికలు 97.68 శాతం ఉత్తీర్ణతను సాధించి బాలుర కంటే బాలికలు ముందజలో నిలిచారు. ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఈసారి పరీక్షల్లో 10 జీపీఏ సాధనలో సత్తా చాటారు. గత ఏడాది జిల్లాలో 2,452 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఆ సంఖ్య ఈ ఏడాది 3,283 కు చేరింది. గత ఏడాది కంటే ఈ సారి పది జీపీఏ సాధించిన విద్యార్థులు 831 మంది పెరిగారు. కేజీబీవీలో 97 శాతం ఉత్తీర్ణత జిల్లాలోని 20 కేజీబీవీ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు గతేడాది కంటే ఈసారి 12 కేజీవీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో ఉన్న 20 కేజీబీవీ పాఠశాలల నుంచి 719 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 693 మంది ఉత్తీర్ణత చెందగా, 27మంది ఫెయిల్ అయ్యారు. అలాగే జిల్లాలోని 19 మోడల్ స్కూళ్లల్లో 1,269 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 11 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఒక విద్యార్థి పరీక్షకు హాజరు కాలేదు. ప్రభుత్వ బడుల్లో పెరిగిన ఉత్తీర్ణత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతానికి భిన్నంగా ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ ఏడాది 34,711 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 33,292 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుంచి 18,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 17,913 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని 8 మండలాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మార్చిలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు 52,569 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 51,205 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన 1,364 మంది ఫెయిల్ అయ్యారు. పది’లో సత్తాచాటిన ఉర్దూ పాఠశాలలు మదనపల్లె సిటీ: జిల్లాలో 30 ఉర్దూ ఉన్నత పాఠశాలలుండగా అందులో 20 పాఠశాలల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన వి.కోట ఉర్దూ ఉన్నత పాఠశాలలోని ముగ్గురు విద్యార్థినులు ఏకంగా పదికి పది పాయింట్లు సాధించి తమ సత్తాను చాటారు. జిల్లాలోని పెనుమూరు మండలంలోని పూనేపల్లె, కుప్పంలోని కుప్పం మెయిన్, వి.కోట మండలంలోని నాలుగు ఉర్దూ ఉన్నత పాఠశాలలు, వి.కోట మెయిన్, నడిపేపల్లె, కొంగాటం, ఖాజీపేట, బైరెడ్డిపల్లె, యాదమరి మండలంలోని 14 కండ్రిగ, కలికిరి మండలంలోని గడి, మహల్, మదనపల్లె రూరల్ మండలం బాలాజీనగర్, అర్బన్‌లోని మున్సిపల్ ఉన్నత పాఠశాల, బి.కొత్తకోట, పీటీఎం, పెద్దమండ్యం మండలంలోని కలిచెర్ల, నిమ్మనపల్లె, చౌడేపల్లె మండలంలోని దాదేపల్లె, గంగవరం మండలంలోని పెద్ద ఉగిలి, తిరుపతి కార్పొరేషన్ ఉర్దూ ఉన్నత పాఠశాల, వాల్మీకిపురం మైనార్టీ గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి. మిగిలిన 10 పాఠశాలలు సరాసరి 95 శాతం ఫలితాలను సాధించి తమ ఆ«ధిక్యతను చాటుకున్నాయి. -
‘పది’ స్థానం మారేనా?
పదో తరగతి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. దీంతో జిల్లా స్థానం ఈసారైన ‘పది’లో మారనుందా లేదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రెండేళ్లుగా జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలువగా ఈసారైన స్థానం మార్చాలని విద్యాశాఖ అధికారులు మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఉపాధ్యాయుల కొరత, విద్యావలంటీర్లతో బోధన కొనసాగిస్తుండడం పది ఫలితాలపై ప్రభావం చూపుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లా వెనుకబడుతూనే ఉంది. గతేడాది రాష్ట్రంలో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ సారైనా టాప్–10లోకి వస్తుందని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. 2017–18 సంవత్సరంలో 28వ స్థానం, 2016–17, 2014–15, 2013–14లో రాష్ట్రస్థాయిలో చివరి స్థానాల్లో నిలిచింది. 2015–16లో కొంత మెరుగుపడినా ఆ తర్వాత అవే ఫలితాలు వస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కొంత మెరుగు పడుతున్నప్పటికీ ఎస్సెస్సీలో మాత్రం చివరి స్థానాలే దక్కుతున్నాయి. సోమవారం పదో తరగతి ఫలితా లను విద్య శాఖ కమిషనర్ ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారైనా మెరుగుపడేనా.. గతేడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా అదమ స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. 51.94 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 2016–17 సంవత్సరంలో 71.15శాతం కాగా, గతేడాది 19.21 శాతం ఉత్తీర్ణత తగ్గింది. సగం మంది విద్యార్థులు ఫెయిలైయ్యారు. గణితం, ఫిజికల్ సైన్స్‌లో 3వేలకు పైగా విద్యార్థులు ఫెయిలైయ్యారు. ఈసారి జిల్లాలో 13,576 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 10,098 మంది పరీక్షలకు హాజరుకాగా గతంలో ఫెయిలైన విద్యార్థులు 3,478 మంది పరీక్షలు రాశారు. అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా చదువుల పరంగా వెనుకబడి పోతోంది. ప్రతియేడాది పాఠశాల ప్రారంభ సమయంలో, పరీక్షల కంటే ముందు విద్యశాఖ అధికారులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఖాళీల కొరతతోనే.. పదో తరగతి ఫలితాలు తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. టీఆర్టీ ఫలితాలు విడుదల చేసినప్పటికీ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం లేదు. విద్యావలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యార్థులకు సరైన విద్యాబోధన సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాల విధులకు డుమ్మా కొట్టడం, పాఠశాలకు వచ్చినా విద్యాబోధన చేయకపోవడంతో ఈ ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోందనే ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో వారు ఎంఈఓ కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. పాఠశాలల్లోని సీనియర్ ఉపాధ్యాయులకు హెచ్ఎం బాధ్యతలు అప్పగిస్తుండడంతో పాఠశాలల్లో విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఉప విద్యాధికారులు కూడా రెగ్యులర్ లేరు. దీంతో పర్యవేక్షణ లోపంతో కొన్నేళ్లుగా ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ఈసారైనా పది ఫలితాలు మెరుగుపడతాయో లేదో వేచి చూడాల్సిందే. పడిపోతున్న ఫలితాలు.. జెడ్పీ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ముఖ్యంగా పదో తరగతి ఫలితాలు తగ్గుతూ వస్తున్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కొంత ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. గతేడాది జిల్లాలో కేవలం ఇద్దరు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మాత్రమే పది జీపీఏ గ్రేడ్ సాధించారు. ఈసారి కనీసం 20 మంది అయినా పది జీపీఏ ఫలితాలు సాధిస్తారని విద్య శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం... గతంకంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం. జిల్లా రాష్ట్రస్థాయిలో టాప్–10లో ఉంటుందని భావిస్తున్నాం. పది ఫలితాలు మెరుగుపర్చేందుకు జూన్ నుంచే పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాం. ఫెయిలైన విద్యార్థులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు. జీవితంలో మార్కులు ప్రామాణికం కాదు. పదో తరగతిలో తక్కువ మార్కులు సాధించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర విద్యార్థులతో పిల్లల్ని మార్కుల పరంగా పోల్చకూడదు. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈవో, ఆదిలాబాద్ -
ఉత్తీర్ణతలో వెనకడుగు
ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలలంటే ఉత్తీర్ణతపై నమ్మకంతోపాటు భరోసా ఉండేది. అక్కడ చదివిస్తే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న నమ్మకం తల్లిదండ్రుల్లో ఉండేది. రానురాను ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇందుకు ఈ నెల 12న విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలే నిదర్శనం. జిల్లాలో ప్రభుత్వ జూనియర్, ఒకేషనల్, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఫలితాలు అట్టడుగు స్థానంలో నమోదయ్యాయి. ఆ ప్రభావం అడ్మిషన్లపై పడుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలో ఇంటర్మీడియట్ కళాశాలల పనితీరును పర్యవేక్షించా ల్సిన రెగ్యులర్ ఆర్ఐవో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తద్వారా ఎక్కువ మంది ప్రైవేట్ బాట పడుతున్నారని చెబుతున్నారు. ♦ జిల్లా కేంద్రమైన చిత్తూరులో పేరొందిన కళాశాల పీసీఆర్. ఇక్కడి నుంచి ఇంటర్ పరీక్షలకు 240 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 26 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 10.83 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ♦ పుత్తూరులో ఉన్న బాలుర జూనియర్ కళాశాలలలో 97 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. అందులో 36 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 మంది ఫెయిల్ అయ్యారు. ఈ రెండే కాదు జిల్లాలోని దాదాపు 50 శాతానికిపైగా కళాశాలల్లో ఫలితాలు ఇలాగే ఉన్నాయి. చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా 58 ప్రభుత్వ జూనియర్ జనరల్ కళాశాలలు, 28 ఒకేషనల్ కళాశాలలు, 6 ఎయిడెడ్, 2 ఏపీఆర్జేసీ, 11 ఏపీఎస్‌డబ్ల్యూఆర్, 2 ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, 18 మోడల్ స్కూళ్లు, 02 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 2018–19లో మొదటి సంవత్సరానికి సంబంధించి 14,167 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,164 మంది ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ పరిధిలోని కళాశాలల నుంచి 11,431 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,423 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఉత్తీర్ణత చెందిన వారికంటే ఫెయిలైన వారే ఎక్కువ మంది ఉండడం ప్రభుత్వ కళాశాలల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మొదటి సంవత్సరం ఫలితాలు జిల్లాలోని 58 ప్రభుత్వ జూనియర్ జనరల్ కళాశాలల్లో 7,415 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,449 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ కళాశాలల్లో నమోదైన ఫలితాల్లో తంబళ్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 98.28 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో, నెరబైలు జూనియర్ కళాశాలలో 0 % సాధించి చివరి స్థానంలో నిలిచింది. అదే విధంగా జిల్లాలోని 6 ఎయిడెడ్ కళాశాలల్లో 54.19 శాతం, 2 ఏపీఆర్జేసీ కళాశాలల్లో 91.04 శాతం, ఒక ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలో 72.49 శాతం, 2 ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 80.26 శాతం, 18 మోడల్ స్కూళ్లల్లో 58.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మోడల్ స్కూళ్లలో కేవీబీపురం 100 శాతంతో మొదటి స్థానంలోనూ, నడిమూరు 22.45 శాతంతో చివరి స్థానంలోనూ నిలిచాయి. 28 ఒకేషనల్ కళాశాలల్లో 58.58 శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు జిల్లాలోని 58 జూనియర్ కళాశాలల్లో 67.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అందులో కలికిరి 97.92 శాతంతో మొదటి స్థానం, పుత్తూరు 37.11 శాతం ఫలితాలు నమోదై చివరిస్థానంలో నిలిచాయి. జిల్లాలోని 6 ఎయిడెడ్ కళాశాలల్లో 72.88, రెండు ఏపీఆర్జేసీ కళాశాలల్లో 98.57, ఒక ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలో 87.42, రెండు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 84.40, 16 మోడల్ స్కూళ్లల్లో 81.35 శాతం ఫలితాలు నమోదయ్యాయి. మోడల్ స్కూళ్లల్లో కేవీబీపురం 100 శాతంతో మొదటి స్థానం, పెద్దతిప్పసముద్రం 45 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రభుత్వ కళాశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఫలితాలు తగ్గాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెగ్యులర్ ఆర్ఐవో లేకపోవడం, ఇన్చార్జీలు మారుతుండడంతో పర్యవేక్షణ లోపం తలెత్తింది. క్షేత్రస్థాయి తనిఖీలు చేయకపోవడం వల్ల ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లలో బాధ్యత లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితాల ప్రభావం రాబోయే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లపై పడనుందని విద్యావేత్తలు అంటున్నారు. -
పది పాసవడం.. ఇక ఈజీ!
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదోతరగతి చదివే విద్యార్థులకు శుభవార్త. ఇక మీరంతా పదోతరగతి పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే పాస్ మార్కులకు సంబంధించిన నిబంధనలను సవరించి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్ఈ) త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తంగా 33 శాతం వస్తే చాలు.. ప్రస్తుతం సీబీఎస్ఈ విద్యావిధానంలో పదో తరగతిలో ఓ విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలంటే ఇంటర్నల్స్‌లో 33 శాతం, థియరీ పరీక్షల్లో 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనను సవరించి, ఇంటర్నల్స్, థియరీలో కలిపి 33 శాతం మార్కులు వస్తే చాలు. అంటే థియరీలో 33 శాతంకంటే తక్కువగా వచ్చి, ఇంటర్నల్స్‌లో 33 శాతం కంటే ఎక్కువ వచ్చినా.. మొత్తంగా 33 శాతం దాటితే ఉత్తీర్ణులైనట్లే. రెండింటిలో 33 శాతం మార్కులు రావాలనే నిబంధన నుంచి మినహాయింపును ఇవ్వాలని సీబీఎస్ఈ యోచిస్తున్నట్లు సమాచారం. మీ అభిప్రాయమేంటో చెప్పండి.. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ని అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు బోర్డు జారీచేసింది. 33 శాతం నిబంధనను సవరించడంపై అభిప్రాయమేంటో చెప్పాలని ఆయా పాఠశాలలను సీబీఎస్ఈ కోరింది. వాటి నుంచి సమాధానం వచ్చిన వెంటనే ఈ వారంలోనే సమావేశమై, దీనిపై అధికారిక ప్రకటన జారీ చేయాలని భావిస్తోంది. 2011 నుంచి సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలను ఆప్షన్ (ఐచ్చికం)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ 7 ఏళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలను కచ్చితం చేశాయి. దీంట్లో భాగంగానే పరీక్ష విధానాల్లో ఈ మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు... వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన కార్యాచరణను బోర్డు అధికారులు వేగవంతం చేశారు. 10, 12 తరగతుల పరీక్షలకు ముందు జరిగే ‘స్టూడెంట్ యాక్టివిటీస్’ను వీలైనంత త్వరగా అందజేయాలని ఆయా విద్యా సంస్థలు, పాఠశాలలకు సీబీఎస్ఈ అధికారులు లేఖలు పంపారు. దీన్ని బట్టి ఏటా జరిగే తేదీలకంటే ముందుగానే బోర్డు పరీక్షలు ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివే 9, 10 తరగతుల విద్యార్థుల వివరాలు ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్షల నిర్వహణ నిమిత్తం ఆయా వివరాలను cbse.nic.inలో నమోదు చేయాలని సూచించింది. -
లెక్క తప్పింది!
⇒మ్యాథ్స్‌లో ఎక్కువగా ఫెయిలవుతున్న విద్యార్థులు ⇒ఏటా పడిపోతున్న ఉత్తీర్ణత శాతం ⇒లెక్కల మాస్టార్లు ఉన్నా ఫలితం శూన్యం ⇒పర్యవేక్షణ లేమి, ప్రభుత్వ తీరుపై విమర్శలు ⇒నెరవేరని ‘మహా సంకల్పం’ ⇒ఇకనైనా మేల్కొంటారో..లేదో? లెక్క తప్పింది. ఈ సారీ పది ఫలితాల్లో జిల్లా అట్టడుగునే నిలిచింది. దీనికి లెక్కల సబ్జెక్టే ప్రధాన కారణమైంది. మాస్టార్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. తరచూ అధికారులను మార్చేయడం, ఇన్చార్జ్ అధికారులతోనే నెట్టుకురావడం.. పర్యవేక్షణ లేకపోవడమే పెద్ద పొరబాటని ఉపాధ్యాయ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. చిత్తూరు, సాక్షి: పది ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలి చింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతమూ తగ్గిపోయింది. గత ఏడాది 90.11 శాతం ఉత్తీర్ణత వస్తే.. ఈసారి 80.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి జిల్లా వరుసగా మూడోసారి చివరిస్థానంలో నిలవడంపై కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అసంతృప్తికి లోనయ్యారు. చీటికీమాటికీ అధికారులను మార్చడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మూడు ముక్కలాట విద్యాశాఖకు కొంతకాలంగా పూర్తిస్థాయిలో అధికారి లేరు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇన్చార్జ్ డీఈవోతోనే నెట్టుకురావాల్సి వస్తోంది. ఆయనకు (తిరుపతి డీవైఈవో, ఇన్చార్జ్ డీఈవో, ఇన్చార్జ్ పీవో) మూడు పదవులుండడంతో పనిభారం ఎక్కువైపోయింది. విద్యాశాఖపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పది ఫలితాల్లో వెనుకబడటానికి కారణాలివే ⇒పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన తరుణంలో డీఈవోను మార్చివేశారు ⇒ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయింది ⇒ఎంఈవో పోస్టులను విద్యా సంవత్సరం చివరలో చేపట్టారు ⇒గత ఫలితాలపై విశ్లేషించుకోలేకపోయారు ⇒సిలబస్ నిర్ణీత కాలంలో పూర్తి చేయలేకపోయారు లెక్క తప్పింది ఇలా.. ఆరేళ్ల నుంచి జిల్లా విద్యార్థులు గణితంలో అధికంగా ఫెయిలవుతున్నారు. దీనిపై అధికారులు శ్రద్ధ చూపలేకపోయారు. లెక్కల మాస్టార్లు 1,900 మంది ఉన్నా ఫలితాల్లో ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. ఒక్కో పాఠశాలలో కనీసం ఇద్దరు లెక్కల టీచర్లు ఉన్నారు. అయినా ఉత్తీర్ణత సాధించడంలో వెనకబడి పోతున్నారు. ఈ ఏడాది పదిలో లెక్కల పరీక్ష 27,464 మంది విద్యార్థులు రాశారు. అందులో 20,699 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏ1 గ్రేడు సాధించనవారు వందల మంది మాత్రమే. ‘మహా’ వృథా పది ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు గత కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మహాసంకల్పం పేరుతో విద్యార్థులకు వారానికో పరీక్ష జరిపించారు. ఎక్కడ వెనుకబడ్డారో గమనించి వారికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు డీఈవో ఆఫీసుకు పంపేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇదే అదునుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వచ్చే మార్కులను ఎక్కువ చేసి పంపడం నేర్చుకునేశారు. మహా సంకల్పం వృథాగా మారిపోయింది. రాజకీయ జోక్యం ఎక్కువ విద్యారంగంపై రాజకీయ జోక్యం ఎక్కువ. శాఖల్లో ఉన్నత స్థానం ఖాళీ అయితే వాటిని అధికార పార్టీ నాయకుల ఇష్టులకే వదిలేయడం రివాజుగా మారుతోంది. అనర్హులు ఉన్నత స్థానాలను అ«ధిరోహిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ వారి మాట వినకుంటే నిర్ధాక్షణ్యంగా వేటు వేయడం పరిపాటిగా మారిపోయింది. డీఈవో నాగేశ్వరరావు ఉదంతాన్నే దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. -
సీబీఎస్ఈ టెన్త ఫలితాల్లో బాలికలదే పైచేయి
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీ ఎస్ఈ) 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 98.87 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు సీబీఎస్ఈ అధికారులు వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచే యి సాధించారని, వీరి ఉత్తీర్ణతా శాతం 99.06గా ఉందని తెలిపారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 98.74గా ఉందన్నారు. కాగా, దేశం మొత్తంలో తిరువనంతపురం రీజియన్ 99.96 శాతంతో అత్యధిక మార్కులు సాధించి ప్రథమస్థానం కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఈ నెల 19న విడుదలైన ఫలితాల్లో చెన్నై రీజియన్ కూడా సత్తా చాటిందన్నారు. మొత్తం 1, 32,7250 మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారని, గత ఏడాదితో పోల్చుకుంటే 5.51 శాతం ఎక్కువని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హాజ రైన విద్యార్థుల్లో 99.89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. -
టెన్‌తలోనూ టాపే
కొనసాగిన బాలికల హవా.. * మొత్తం ఉత్తీర్ణత శాతం 81.19 బాలురు 77%,బాలికలు 85.46 % * 2,023 స్కూళ్లల్లో అందరూ పాస్,17లో అందరూ ఫెయిల్ * మెరుగైన ఫలితాలు సాధించిన గ్రామీణ విద్యార్థులు * జిల్లాల వారీగా ఉత్తీర్ణతలోటాప్ చిక్కోడి, లాస్ట్ బీదర్ * తాలూకాల్లో జోయిడా ఫస్ట్, గౌరిబిదనూరు ఆఖరు సాక్షి, బెంగళూరు : పదోతరగతి పరీక్ష ఫలితాల్లోనూ బాలికలే ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 8,13,498 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 6,60,515 శాతం మంది (81.19 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే (77.47) ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 3.72 శాతం ఎక్కువ. మొత్తం 4,32,533 మంది బాలురకు గాను 3,34,925 (77 శాతం) మంది, 3,80,965 మంది బాలికలకు 3,25,590 (85.46 శాతం) మంది పాస్ అయ్యారు. ప్రాథమిక మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ మల్లేశ్వరంలోని ఎస్ఎస్ఎల్సీ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఈ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. రాష్ర్టంలో మొత్తం 2,023 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా.. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. పట్టణ విద్యార్థుల కంటే (80.84) గ్రామీణ విద్యార్థులు (85.33) ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే చిక్కోడి, సిరిసి, బెల్గాం వరుసగా మొదటి, రెండు, మూడో స్థానంలో ఉండగా బీదర్ చివరి స్థానంలో ఉంది. తాలూకాల పరంగా తీసుకుంటే ఉత్తర కన్నడ జిల్లాలోని జోయిడా (సూపా) 97.26 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం, 64.07 శాతం ఉత్తీర్ణతతో గౌరిబిదనూరు చివరి స్థానంలో ఉంది. ఇక ఈ ఏడాది 40 నుంచి 58 ఏళ్ల మధ్య ఉన్న ఉన్నవారు 866 మంది ఈ పరీక్షలు రాయగా అందులో 75 మంది పాస్ అయ్యారు. 478 మంది విద్యార్థులు తెలుగు మాద్యమంలో పరీక్షలు రాయగా అందులో 320 మంది (66.95 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లీషు మీడియంలో వీరే ఫస్ట్.. * మైసూరులోని మల్లప్ప హైస్కూల్లో చదువుతున్న నిత్యసురభి 625 మార్కులకు గాను 622 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. * 621 మార్కులతో అభిజ్ఞా, అభిలాష, సింధూ బదరి, ధన్యభారతి రెండో స్థానాన్ని ఆక్రమించారు. వీరంతా బెంగళూరు నార్త్‌కు చెందిన వారే కావడం గమనార్హం. * 620 మార్కులతో అనుజ్ఞా, హైమావతి, అక్షయరాఘవన్, రాహుల్, మైథిలి మూడో స్థానంలో నిలిచారు. * కన్నడ మీడియంలో 617 మార్కులతో చిక్కోడికి చెందిన విషల్ మొదటి స్థానం, 615 మార్కులతో మైత్రీ హెగ్డే రెండో స్థానం, 614 మార్కులతో నాగరాజ్ కామత్ మూడో స్థానాన్ని పొందారు. * సబ్జెక్టుల పరంగా తీసుకుంటే సాంఘికశాస్త్రంలో అత్యధికంగా 1,058 మంది వందకు వంద మార్కులు, అతి తక్కువగా విజ్ఞానశాస్త్రంలో 16 మంది వందకు వంద మార్కులు సాధించారు. -
వెబ్సైట్లో టెన్త్ ఫలితాల విశ్లేషణ
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తక్కువ ఉత్తీర్ణతా శాతం వచ్చిన పాఠశాలలపై మరింత దృష్టి పెట్టేందుకు జిల్లా విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ www.deochittoor.orgలో జిల్లాలోని 602 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వచ్చిన పది ఫలితాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమీక్షించుకునే విధంగా వెబ్సైట్లో పెట్టారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 92.18 ఉత్తీర్ణతా శాతం ఉంది. చొరవ తీసుకున్న కలెక్టర్ కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ చొరవ కారణంగానే వెబ్సైట్లో ఈ వివరాలు పెట్టారు. నెల రోజుల క్రితం ఆయన విద్యాశాఖ అధికారులతో దీనిపై మాట్లాడారు. వెబ్సైట్లో విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించిన ప్రేమ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడిని పిలిపించి టెన్త ఫలితాలకు సంబంధించి ప్రోగ్రాం రూపొందించాలని ఆదేశించారు. కలెక్టర్ సూచనల ప్రకారం 20 రోజుల పాటు కష్టపడి ప్రేమ్‌కుమార్ జిల్లా స్థాయిలో వచ్చిన ఫలితాలను, పాఠశాలలో వచ్చిన ఫలితాలతో పోలుస్తూ గ్రాఫ్‌లు రూపొందించి వెబ్సైట్లో పెట్టారు. ఇందులో మండలాల వారీగా పాఠశాలలు, గత ఏడాది అవి పది పరీక్షల్లో సాధించిన ఫలితాలు సబ్జెక్టుల వారీగా ఉంటాయి. వీటి ఆధారంగా తమ పాఠశాల విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో గమనించి దానిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ఏం చేయాలో ప్రణాళికలు వేసుకోవచ్చు. హెచ్‌ఎంలందరూ సమీక్ష జరపాలి ఇది జిల్లా కలెక్టర్ ఆలోచనల రూపం. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ www.deochittoor. org వెబ్సైట్లో పెట్టిన ఫలితాలను చూసుకొని తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలో ప్రణాళికలు వేసుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ఫలితాలు వచ్చిన సబ్జెక్టులో ఎందుకు ఇలా జరిగిందని ఉపాధ్యాయులతో కలిసి సమీక్షించాలి. -బి.ప్రతాప్‌రెడ్డి, డీఈవో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఈ కార్యక్రమంపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చాలాసార్లు పిలిపించి మా ట్లాడి దీనికి ఒకరూపం తెచ్చారు. ఈ పనిచేసే సమయంలో ఎప్పటికప్పుడు పని ఎంతవరకు వచ్చిందని ఆరా తీ స్తూండేవారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ తోనే ఈ వెబ్‌సైట్‌ను ఇంత త్వరగా రూపొందించాము. వచ్చే విద్యాసంవత్సరంలో టెన్తలో ఇంకా మంచి ఫలితాలు వచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. -ప్రేమ్‌కుమార్, డీఈవో కార్యాలయం అధికారిక వెబ్సైట్ రూపకర్త