ఇంటర్‌ ఫలితాలు బాలికలే టాప్‌ | Telangana Inter Results Released And Girls Pass Percentage Is Top | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాలు బాలికలే టాప్‌

Published Fri, Jun 19 2020 1:24 AM | Last Updated on Fri, Jun 19 2020 7:53 AM

Telangana Inter Results Released And Girls Pass Percentage Is Top - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. బాలురకంటే బాలికలే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి 4 నుంచి 21 వరకు జరిగిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాం చంద్రన్, బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ పాల్గొన్నారు. ద్వితీయ సంవత్సరంలో 75.15% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 62.10% మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ద్వితీయ సంవత్సరంలో (జనరల్, వొకేషనల్‌) రెగ్యులర్‌ విద్యార్థులు 68.86% మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌ తీసేసి జనరల్‌లోనే చూస్తే 69.61% మంది ఉత్తీ ర్ణులయ్యారు. ఫస్టియర్‌లోనూ 67.47% మంది బాలికలు, 52.30 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ప్రథమ సంవత్స రంలో 60.01% మంది ఉత్తీర్ణులయ్యారు.

ప్రథమ స్థానంలో ఆసిఫాబాద్, మేడ్చల్‌
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆసిఫాబాద్, మేడ్చల్‌ జిల్లాలు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా మెదక్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి (వొకేషనల్‌ రెగ్యులర్‌ ప్రైవేటు మినహా) 4,44,708 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 2,82,208 మంది ఉత్తీర్ణులయ్యారు. అం దులో ఆసిఫాబాద్‌ జిల్లా 80% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ద్వితీయ సంవ త్సర జనరల్, వొకేషనల్‌లో రెగ్యులర్‌ విద్యార్థులనే తీసుకుంటే 4,11,631 మంది పరీక్షలకు హాజరు కాగా 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 80% ఉత్తీర్ణతతో మేడ్చల్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రెండు కేటగిరీల్లోనూ మెదక్‌ చివరి స్థానంలో నిలిచింది.
ఫలితాలకు సంబంధించిన మరిన్ని వివరాలు..

  • ప్రథమ సంవత్సరంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4,80,555. అందులో జనరల్‌ విద్యార్థులు 4,31,358 మంది, వొకేషనల్‌ విద్యార్థులు 49,197 మంది ఉన్నారు. 
  • ప్రథమ సంవత్సరంలో 2,44,105 మంది బాలికలు పరీక్షలకు హాజరవగా బాలురు 2,36,450 మంది పరీక్షలకు హాజరయ్యారు. 
  • ప్రథమ సంవత్సరంలో మొత్తంగా ఉత్తీర్ణులైన వారు 2,88,383 (60.01 శాతం) మంది ఉన్నారు. వారిలో జనరల్‌ విద్యార్థులు 2,63,463 మంది. వొకేషనల్‌ విద్యార్థులు 24,920 మంది విద్యార్థులు ఉన్నారు.
  • పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 1,64,704 మంది (67.47 శాతం) ఉత్తీర్ణులవగా 1,23,679 మంది (52.30 శాతం) బాలురు ఉత్తీర్ణులయ్యారు.

ప్రథమ సంవత్సరంలో గ్రేడ్‌లవారీగా ఉత్తీర్ణులు..


ద్వితీయ సంవత్సరంలో..

  • ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్‌ రెగ్యులర్‌ విద్యార్థులు, వొకేషనల్‌ రెగ్యులర్‌ విద్యార్థులు 4,11,631 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో జనరల్‌లో రెగ్యులర్‌ విద్యార్థులు 3,74,492 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్‌ విద్యార్థులు 37,139 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్‌ ప్రైవేటు విద్యార్థులు 70,216 మంది, వొకేషనల్‌లో ప్రైవేటు విద్యార్థులు 3,660 మంది పరీక్షలకు హాజరయ్యారు.
  • ద్వితీయ సంవత్సరంలో పరీక్షలకు మొత్తంగా జనరల్, వొకేషనల్‌ రెగ్యులర్‌లో 2,13,121 మంది బాలికలు హాజరవగా, 1,98,510 మంది బాలురు హాజరయ్యారు.
  • పరీక్షలకు హాజరైన మొత్తం ద్వితీయ సంవత్సర జనరల్, వొకేషనల్‌ రెగ్యులర్‌ విద్యార్థుల్లో 2,83,462 మంది (68.86 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో జనరల్‌ రెగ్యులర్‌ విద్యార్థులు 2,60,703 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్‌ విద్యార్థులు 22,759 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్‌ ప్రైవేటు విద్యార్థులు 21,505 మంది,  వొకేషనల్‌ ప్రైవేటు విద్యార్థులు 1,713 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
  • ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్‌ బాలికల్లో 1,60,171 మంది (75.15 శాతం) ఉత్తీర్ణులుకాగా పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్‌ బాలురులో 1,23,291 మంది (62.10 శాతం) ఉత్తీర్ణులయ్యారు.


ఎంపీసీలో అత్యధికంగా ఉత్తీర్ణత
ఈసారి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా గ్రూపులతో పోలిస్తే అత్యధికంగా ఎంపీసీలో 67.95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు బోర్డు పేర్కొంది. ఆ తరువాత బైపీపీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. సీఈసీలో చాలా తక్కువ శాతం మంది విద్యార్ణులయ్యారు.
ద్వితీయ సంవత్సర హాజరైన విద్యార్థులు వివరాలు..

పెరుగుతున్న ఉత్తీర్ణత శాతం
ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం ఏటేటాæ పెరుగుతోంది. గతంతో  పోలిస్తే ఈసారి ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఉత్తీర్ణత శాతంలో పెరుగుదల నమోదైంది. గతేడాది మినహాయిస్తే గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014 వార్షిక పరీక్షల్లో 60.14 శాతం ఉన్న ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణత ప్రస్తుతం 68.86 శాతానికి పెరిగింది. రెగ్యులర్‌ విద్యార్థుల్లో మాత్రమే చూస్తే 69.61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలోనూ గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. 2014లో 52.65 శాతం ఉత్తీర్ణత నమోదవగా ఈసారి 61.07 శాతానికి పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement