girls top
-
ఇంటర్ ఫలితాలు.. అమ్మాయిలదే హవా
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మార్చి ఒకటి నుంచి 20 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు బాలికలు, బాలురు కలిపి మొత్తం 10,02,150 మంది హాజరవగా 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,29,528 మంది (78 శాతం), మొదటి సంవత్సరం విద్యార్థులు 3,34,056 మంది (67 శాతం) ఉన్నారు. ఈ మేరకు ఫలితాలను శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్మీడియెట్ విద్యా మండలిలో కమిషనర్, కార్యదర్శి సౌరభ్ గౌర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వీవీ సుబ్బారావు సంయుక్తంగా విడుదల చేశారు. పరీక్షలు ముగిశాక కేవలం 21 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. కాగా ఎప్పటిలాగే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 81 శాతం, మొదటి ఏడాదిలో 71 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురు రెండో ఏడాది 75 శాతం, మొదటి సంవత్సరంలో 64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2023 మార్చిలో ఇంటర్ మొదటి ఏడాది 4.33 లక్షల మంది పరీక్ష రాయగా 61 శాతం, ద్వితీయ సంవత్సరం 3.80 లక్షల మంది రాయగా 72 శాతం మంది పాసయ్యారు. మొత్తం మీద గతేడాది కంటే ఈసారి 6 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. ఫలితాల్లో జిల్లాల వారీగా కృష్ణా మొదటి స్థానంలో (మొదటి సంవత్సరం 84 శాతం, ద్వితీయ సంవత్సరం 90 శాతం) సాధించగా, చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు (ఇంటర్ మొదటి ఏడాది), చిత్తూరు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. ఫలితాలను https://resultsbie.ap.gov.in లేదా www. sakshieducation.comÌ లో చూడవచ్చు. ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి.. ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు మొదటి ఏడాది 47 శాతం, రెండో ఏడాది 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్ విభాగంలో బాలికలు, బాలురు కలిపి మొదటి సంవత్సరం మొత్తం 38,483 మంది పరీక్షలకు హాజరు కాగా 23,181 మంది (60 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32,339 మంది హాజరవగా 23 వేల మంది (71 శాతం) విజయం సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ఏడాది 77 శాతం, రెండో ఏడాది 83 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. చివరి స్థానంలో వైఎస్సార్ (మొదటి ఏడాది), పల్నాడు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. 24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని కార్యదర్శి సౌరభ్ గౌర్ కోరారు. ఈ నెల 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. మార్కుల లిస్టులు డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇవి రెగ్యులర్ పత్రాలుగానే చెల్లుబాటవుతాయన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా ఉండాలి ఉత్తీర్ణులు కానివారు ఆందోళన చెందొద్దని సౌరభ్ గౌర్ సూచించారు. గతంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైనవారికి ‘కంపార్ట్మెంటల్’ అని సరి్టఫికెట్‌పై వచ్చేదని, ఇప్పుడు దాన్ని రద్దు చేశామన్నారు. ఇకపై సప్లిమెంటరీ కూడా రెగ్యులర్‌తో సమానంగానే ఉంటుందన్నారు. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు మనోధైర్యాన్ని అందించాలని సూచించారు. బైపీసీలో విశాఖ అమ్మాయి పావనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా గాజువాక చైతన్య కళాశాల విద్యార్థి శరగడం పావని సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును దక్కించుకుంది. పావని తండ్రి నాగగంగారావు గంగవరం పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని పావని తెలిపింది. కిరణ్మయికి స్టేట్ సెకండ్ ర్యాంక్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ఆలూరి కిరణ్మయి సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. కిరణ్మయి విజయవాడలోని శ్రీ గోసలైట్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది. కిరణ్మయి తండ్రి ఏవీ గిరిబాబు సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి విజయశాంతి గృహిణి. ఎంబీబీఎస్ చదివి న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన చిరకాల కోరిక అని కిరణ్మయి వెల్లడించింది. -
సైన్స్‌లో సోనాలి కామర్స్‌లో సుగంధ ఆర్ట్స్‌లో భారతి
ఇంటర్ పరీక్షల నిర్వహణలో బిహార్ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్.. ఈ మూడు స్ట్రీమ్‌లలోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలవడం విశేషం. సైన్స్‌లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్! సోనాలికి స్వీట్ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర) మార్చి 26 శుక్రవారం బిహార్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్‌గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్‌లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్‌లో, ఔరంగాబాద్‌కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్‌లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. సైన్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు. సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్ షరిఫ్ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్‌లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్డౌన్ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్డౌన్ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్ సర్ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్ సార్ టెన్త్‌లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్లు తీర్చేవారు. లాక్డౌన్లో సార్ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్‌లు టీచ్ చేసేవారు. ఆన్ లైన్ స్టడీస్ కోసం అప్పుడప్పుడు తన సెల్‌ఫోన్‌ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్సార్కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్ చెబుతోంది. సోనాలి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్.సి. పరీక్షకు ప్రిపేర్ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి. -
ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. బాలురకంటే బాలికలే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి 4 నుంచి 21 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాం చంద్రన్, బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. ద్వితీయ సంవత్సరంలో 75.15% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 62.10% మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ద్వితీయ సంవత్సరంలో (జనరల్, వొకేషనల్) రెగ్యులర్ విద్యార్థులు 68.86% మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ తీసేసి జనరల్‌లోనే చూస్తే 69.61% మంది ఉత్తీ ర్ణులయ్యారు. ఫస్టియర్‌లోనూ 67.47% మంది బాలికలు, 52.30 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ప్రథమ సంవత్స రంలో 60.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ స్థానంలో ఆసిఫాబాద్, మేడ్చల్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి (వొకేషనల్ రెగ్యులర్ ప్రైవేటు మినహా) 4,44,708 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 2,82,208 మంది ఉత్తీర్ణులయ్యారు. అం దులో ఆసిఫాబాద్ జిల్లా 80% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ద్వితీయ సంవ త్సర జనరల్, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులనే తీసుకుంటే 4,11,631 మంది పరీక్షలకు హాజరు కాగా 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 80% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రెండు కేటగిరీల్లోనూ మెదక్ చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలకు సంబంధించిన మరిన్ని వివరాలు.. ప్రథమ సంవత్సరంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4,80,555. అందులో జనరల్ విద్యార్థులు 4,31,358 మంది, వొకేషనల్ విద్యార్థులు 49,197 మంది ఉన్నారు. ప్రథమ సంవత్సరంలో 2,44,105 మంది బాలికలు పరీక్షలకు హాజరవగా బాలురు 2,36,450 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరంలో మొత్తంగా ఉత్తీర్ణులైన వారు 2,88,383 (60.01 శాతం) మంది ఉన్నారు. వారిలో జనరల్ విద్యార్థులు 2,63,463 మంది. వొకేషనల్ విద్యార్థులు 24,920 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 1,64,704 మంది (67.47 శాతం) ఉత్తీర్ణులవగా 1,23,679 మంది (52.30 శాతం) బాలురు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో గ్రేడ్లవారీగా ఉత్తీర్ణులు.. ద్వితీయ సంవత్సరంలో.. ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ రెగ్యులర్ విద్యార్థులు, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు 4,11,631 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో జనరల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 3,74,492 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 37,139 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్ ప్రైవేటు విద్యార్థులు 70,216 మంది, వొకేషనల్‌లో ప్రైవేటు విద్యార్థులు 3,660 మంది పరీక్షలకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరంలో పరీక్షలకు మొత్తంగా జనరల్, వొకేషనల్ రెగ్యులర్‌లో 2,13,121 మంది బాలికలు హాజరవగా, 1,98,510 మంది బాలురు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన మొత్తం ద్వితీయ సంవత్సర జనరల్, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థుల్లో 2,83,462 మంది (68.86 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో జనరల్ రెగ్యులర్ విద్యార్థులు 2,60,703 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 22,759 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్ ప్రైవేటు విద్యార్థులు 21,505 మంది, వొకేషనల్ ప్రైవేటు విద్యార్థులు 1,713 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్ బాలికల్లో 1,60,171 మంది (75.15 శాతం) ఉత్తీర్ణులుకాగా పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్ బాలురులో 1,23,291 మంది (62.10 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో అత్యధికంగా ఉత్తీర్ణత ఈసారి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా గ్రూపులతో పోలిస్తే అత్యధికంగా ఎంపీసీలో 67.95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు బోర్డు పేర్కొంది. ఆ తరువాత బైపీపీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. సీఈసీలో చాలా తక్కువ శాతం మంది విద్యార్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర హాజరైన విద్యార్థులు వివరాలు.. పెరుగుతున్న ఉత్తీర్ణత శాతం ఇంటర్లో ఉత్తీర్ణత శాతం ఏటేటాæ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఉత్తీర్ణత శాతంలో పెరుగుదల నమోదైంది. గతేడాది మినహాయిస్తే గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014 వార్షిక పరీక్షల్లో 60.14 శాతం ఉన్న ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణత ప్రస్తుతం 68.86 శాతానికి పెరిగింది. రెగ్యులర్ విద్యార్థుల్లో మాత్రమే చూస్తే 69.61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలోనూ గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. 2014లో 52.65 శాతం ఉత్తీర్ణత నమోదవగా ఈసారి 61.07 శాతానికి పెరిగింది. -
సీబీఎస్ఈ ఫలితాల్లో అమ్మాయిలే టాప్
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాల్లో బాలికలు దుమ్ములేపారు. బాలుర కంటే దాదాపు 9 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. అలాగే 500కు 499 మార్కులు సాధించి ఇద్దరు బాలికలు టాపర్లుగా నిలిచారు. గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో బాలురు 79.40 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 88.70 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఈ పరీక్షల్లో 83.4 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ఫలితాలను సీబీఎస్ఈ తన వెబ్సైట్లో పొందుపరిచింది. నగరాల వారీగా చూస్తే 98.20 ఉత్తీర్ణతా శాతంతో తిరువనంతపురం తొలి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఉన్న చెన్నై రీజియన్ 92.93 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. 91.87 శాతంతో ఢిల్లీ మూడో స్థానం పొందింది.విదేశాల్లో 78 సెంటర్లలో సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించగా.. వీరిలో 95.43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు దాదాపు 12.05 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టాపర్లుగా నిలిచిన హన్సిక, కరిష్మా.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, ముజాఫర్‌నగర్‌కు చెందిన కరిష్మా అరోరాలు 500కు 499 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. రిషీకేశ్‌కు చెందిన గౌరంగీ చావ్లా, రాయ్‌బరేలీకి చెందిన ఐశ్వర్య, జిండ్కు చెందిన భవ్య 500కి 498 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 497 మార్కులతో మొత్తం 18 మంది విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు. పరీక్షల ముందు నుంచే తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండి, విశ్రాంతి వేళ పాటలు విన్నానని హన్సిక చెప్పింది. రిలాక్స్ అయ్యేందుకు డ్యాన్స్ చేసేదానినని కరిష్మా చెప్పింది. కేజ్రీవాల్ కుమారుడికి 96.4 శాతం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొడుకు పుల్కిత్‌కు 96.4 శాతం మార్కులు వచ్చాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా పలువురు మంత్రులు పుల్కిత్‌కు అభినందనలు తెలిపారు. స్మృతీ ఇరానీ కుమారుడికి 91 శాతం ఫలితాల్లో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కొడుకు జోహర్‌కు 91 శాతం మార్కులు వచ్చాయి. ‘వరల్డ్ కెంపో చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలవడమే కాదు, జోహర్ 12వ తరగతిలో 91 శాతం మార్కులు సాధించాడు. యాహూ’ అని స్మృతి ట్వీట్ చేశారు. రీ వెరిఫికేషన్‌కు 8 వరకు అవకాశం మార్కుల రీ వెరిఫికేషన్ కోసం మే 4 నుంచి 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు రుసుము రూ.500. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల ఫొటో కాపీల కోసం విద్యార్థులు మే 20, 21 తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఆన్షర్ బుక్కు రూ.700 చొప్పున రుసుము చెల్లించాలి. జవాబు పత్రాల రీ వ్యాల్యుయేషన్‌కు మే 24, 25 తేదీల్లో దరఖాస్తు చేయడానికి సీబీఎస్ఈ అవకాశం కల్పిస్తోంది. ఒక్కో ప్రశ్నకు రూ.100 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
పీఈసెట్‌లో బాలికల ముందంజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్– 2018 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడు దల చేశారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే టాప్ గా నిలిచారు. టాప్–10లో అత్యధికంగా బాలికలే ఉన్నారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఫిజిక ల్ టెస్టుల్లో ప్రతిభ కనబరిచి టాప్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. డీపీఈడీ టాప్–10లో 9 మంది, బీపీఈడీ టాప్–10లో 8 మంది బాలికలు ఉన్నారు. ఇద్దరు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వారు, 36 మంది జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు ఈ సారి పీఈసెట్‌కు హాజరైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ చెప్పారు. ఫలితాలను www.pecet.tsche.ac.in లో పొందవచ్చని, తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాలేజీల అఫిలియేషన్ ప్రక్రి య పూర్తయ్యాక ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేస్తామన్నారు. గతేడాది డీపీఈడీలో 350 సీట్లు, బీపీఈడీలో 1,900 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈసారి అంతే సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని పీఈసెట్ చైర్మన్ ప్రొ. అల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. 128 మంది ఫెయిల్ పీఈసెట్‌లో భాగంగా బీపీఈడీ పరీక్షలో 86 మంది ఫెయిలయ్యారు. డీపీఈడీ పరీక్షలో 42 మంది ఫెయిలయ్యారు. మొత్తంగా పీఈసెట్‌లో 128 మంది ఫెయిలయ్యారు. -
అమ్మాయిలే టాప్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. ఇంటర్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. మంగళవారం ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను విడుదలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు మొత్తం 73.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అమ్మాయిల్లో 74.46 శాతం ఉత్తీర్ణత అబ్బాయిల్లో 71.12 శాతం ఉత్తీర్ణత మొత్తం 4,11,941 పరీక్షలు రాయగా, 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు ఏ గ్రేడ్‌లో 57.46 శాతం, బీ గ్రేడ్‌లో 27.77 శాతం, సీ గ్రేడ్‌లో 11.14, డీ గ్రేడ్‌లో 3.62 శాతం ఉత్తీర్ణత ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానం, నెల్లూరు జిల్లా రెండో స్థానం సాధించాయి మొదటి సంవత్సర ఫలితాలు మొత్తం 68.05 శాతం ఉత్తీర్ణత బాలికల్లో 72.09 శాతం ఉత్తీర్ణత బాలురులో 64.20 శాతం ఉత్తర్ణీత ఏ గ్రేడ్‌లో 58 శాతం, బీ గ్రేడ్‌లో 25.85 శాతం, సీ గ్రేడ్‌లో 11.18 శాతం, డీ గ్రేడ్‌లో 4.73 శాతం ఉత్తీర్ణులయ్యారు మొత్తం 4, 67,747 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,18,300 మంది ఉత్తీర్ణులయ్యారు ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానం, విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచాయి వచ్చే నెల 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 26 వరకు గడువు