విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. ఇంటర్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. మంగళవారం ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను విడుదలు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు
- మొత్తం 73.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
- అమ్మాయిల్లో 74.46 శాతం ఉత్తీర్ణత
- అబ్బాయిల్లో 71.12 శాతం ఉత్తీర్ణత
- మొత్తం 4,11,941 పరీక్షలు రాయగా, 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు
- ఏ గ్రేడ్లో 57.46 శాతం, బీ గ్రేడ్లో 27.77 శాతం, సీ గ్రేడ్లో 11.14, డీ గ్రేడ్లో 3.62 శాతం ఉత్తీర్ణత
- ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానం, నెల్లూరు జిల్లా రెండో స్థానం సాధించాయి
మొదటి సంవత్సర ఫలితాలు
- మొత్తం 68.05 శాతం ఉత్తీర్ణత
- బాలికల్లో 72.09 శాతం ఉత్తీర్ణత
- బాలురులో 64.20 శాతం ఉత్తర్ణీత
- ఏ గ్రేడ్లో 58 శాతం, బీ గ్రేడ్లో 25.85 శాతం, సీ గ్రేడ్లో 11.18 శాతం, డీ గ్రేడ్లో 4.73 శాతం ఉత్తీర్ణులయ్యారు
- మొత్తం 4, 67,747 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,18,300 మంది ఉత్తీర్ణులయ్యారు
- ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానం, విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచాయి
వచ్చే నెల 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 26 వరకు గడువు