సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలి తాలు సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠ శాల విద్య డైరెక్టరేట్ కార్యా లయం ఈ మేరకు జిల్లా అధికారులకు దిశానిర్దేం చేస్తూ..‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తెచ్చింది. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా చూడటం దీని ఉద్దేశం. ఎన్నిక లు కూడా ముగియడంతో ఉన్నత పాఠశాలల ఉపా ధ్యాయులు టెన్త్ విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలని డీఎస్ ఈ సూచించింది. వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక బోధన చేపట్టాలని ఆదేశించింది.
వీలైనంత త్వర గా సిల బస్ పూర్తి చేసి, జనవరిలో పునశ్చరణకు వెళ్లాలని పేర్కొంది. లక్ష్యం సాధించిన పాఠశాలల కు అవార్డు లిచ్చే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తు న్నారు. టెన్త్ పరీక్షలు మార్చి, ఏప్రిల్ నెల లో జరుగుతాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి, పరీక్షలకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై మరింత దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్లపైనే..: రాష్ట్ర ప్రభుత్వ పాఠశా లలు, స్థానిక సంస్థల పాఠశాలల్లో టెన్త్ ఫలితాలు తక్కువగా నమోదవుతున్నాయి. 2023లో జెడ్పీ పా ఠశాలల నుంచి 1,39,922 మంది టెన్త్ పరీక్షకు హా జరైతే, 1,10,738 మంది మాత్రమే ఉత్తీర్ణుల య్యా రు. అంటే 79.14 శాతం రిజల్ట్ నమోదైంది. ప్రభు త్వ స్కూళ్లలో 21,495 మంది పరీక్ష రాస్తే, 15,561 (72.39 శాతం) మంది పాసయ్యారు. ప్రభుత్వ రెసి డెన్షియల్ స్కూళ్లలో 98 శాతం, గురుకు లాల్లో 95 శాతం ఫలితాలొచ్చాయి. ఇది ప్రైవేటు పాఠశాలక న్నా ఎక్కువ. అయితే ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లల్లో ఫలితాలపై ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఆ సబ్జెక్టులపైనే దృష్టి: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎక్కు వగా మేథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సబ్జెక్టులపై ప్రత్యేక బోధనకు ప్లాన్ చేశారు. టెన్త్ విద్యార్థులకు ఉదయం గంట అదనంగా క్లాసులు తీసుకుంటారు. వారంలో 3 సబ్జెక్టులు రోజుకు ఒకటి చొప్పున చేపట్టాలని నిర్ణయించారు.
ఇది కూడా సంబంధిత సబ్జెక్టులో కఠినంగా ఉండే చాప్టర్లను ఎంపిక చేసుకోవాలని పాఠశాలలకు సూచిస్తున్నారు. జనవరి ఆఖరివారం లేదా ఫిబ్రవరి నుంచి సాయంత్రం కూడా అదనంగా మరో గంట ప్రత్యేక బోధన చేపట్టాలని నిర్ణ యించారు. దీనివల్ల టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమనేది అధికారుల ఆలోచన.
Comments
Please login to add a commentAdd a comment