దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్(PC: BCCI Twitter)
South Africa tour of India, 2022- India vs South Africa, 1st T20I: స్వదేశంలో మరో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీ ఆరంభానికి ముందు పటిష్టమైన దక్షిణాఫ్రికాతో పోటీకి సై అంటోంది. వరల్డ్‌కప్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన రీతిలోనే ప్రొటిస్‌ను మట్టికరిపించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై కూడా సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలవలేకపోతోందన్న అపవాదును చెరిపేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం జరుగనున్న మొదటి టీ20లో శుభారంభం చేసేందుకు సన్నద్ధమవుతోంది రోహిత్ సేన. ఇక బవుమా బృందం సైతం గత రికార్డును కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పిచ్, వాతావరణం, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్షప్రసారం, పొట్టి ఫార్మాట్‌లో భారత్- దక్షిణాఫ్రికా ముఖాముఖి రికార్డులు పరిశీలిద్దాం.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మొదటి టీ20(సెప్టెంబరు 28)
వేదిక: గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం- తిరువనంతపురం- కేరళ
మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి ఏడు గంటలకు ఆరంభం
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్
పిచ్, వాతావరణం
ఈ గ్రీన్‌ఫీల్డ్ మైదానం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ రెండు టి20 మ్యాచ్‌లు జరిగాయి. 2017లో న్యూజిలాండ్‌తో ఎనిమిది ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. 2019లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్లతో ఓడింది. బుధవారం వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశముంది.
సొంతగడ్డపై ఒక్కసారి కూడా!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లు ఆడినా భారత్ ఒక్క సిరీస్‌నూ గెలవలేకపోయింది. 2015లో దక్షిణాఫ్రికా 2–0తో సిరీస్‌ను దక్కించుకోగా... 2019లో, 2022లో సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
ముఖాముఖి రికార్డులు.. డీకే ఒక్కడే!
దక్షిణాఫ్రికాతో ఇప్పటివరకు భారత్ 20 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 11 మ్యాచ్‌ల్లో భారత్, 8 మ్యాచ్‌ల్లో దక్షిణా ఫ్రికా గెలిచాయి. మరో మ్యాచ్ రద్దయింది. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ 2006లో డిసెంబర్ 1న జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుతం దినేశ్ కార్తీక్ ఒక్కడే తాజా సిరీస్ లోనూ ఆడుతున్నాడు.
చదవండి: T20 World Cup 2022: ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు..
Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై
Hello Thiruvananthapuram 👋
— BCCI (@BCCI) September 27, 2022
Time for the #INDvSA T20I series. 👍#TeamIndia | @mastercardindia pic.twitter.com/qU5hGSR3Io
Comments
Please login to add a commentAdd a comment