తిరువనంతపురం: మంత్రి కాన్వాయ్‌లోని వాహనం వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో పేషెంట్‌ను తీసుకుని వెళ్తోన్న అంబులెన్స్ తిరగబడింది. అందులో ఉన్న పేషెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాల డ్రైవర్ల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు తిరువనంతపురం పోలీసులు.
కేరళ రాజధానిలోని బిజీ కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కాన్వాయ్ రాంగ్ రూట్లో వచ్చింది. అక్కడి ట్రాఫిక్ పోలీసులు మంత్రి కాన్వాయ్‌కు దారిచ్చేందుకు ట్రాఫిక్స్‌ను మళ్లించే ప్రయత్నం చేశారు. అంతలో అటుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ సరైన దారిలోనే వచ్చింది.
కానీ రోడ్డు మధ్యలో ఒక బైకు ఆగి ఉండడంతో దానిని తప్పించుకుని వెళ్ళింది. అది గమనించని మినిస్టర్ కాన్వాయ్ వాహనం అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. వెంటనే అంబులెన్స్ పల్టీ కొట్టింది. అదృష్టావశాత్తు అక్కడే ఉన్న పోలీసు తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు.
కాన్వాయ్ వాహనం తర్వాత మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. దీంతో వారు కూడా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కానీ అంబులెన్స్‌లోని పేషెంటుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు అక్కడి పోలీసులు. మంత్రి కాన్వాయ్ వాహనాన్నినడిపిన డ్రైవరును అంబులెన్స్ డ్రైవరును ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.
The convoy of Kerala Education Minister V. Sivankutty hit an ambulance and bike, but a case has been registered against the ambulance driver as well.
— BALA (@erbmjha) July 14, 2023
VIP culture and a sense of Entitlement aren't going anywhere. That's lip-service. pic.twitter.com/NYLjhiRjMI
ఇది కూడా చదవండి: కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే!
Comments
Please login to add a commentAdd a comment