minister convoy accident
-
రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్
తిరువనంతపురం: మంత్రి కాన్వాయ్‌లోని వాహనం వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో పేషెంట్‌ను తీసుకుని వెళ్తోన్న అంబులెన్స్ తిరగబడింది. అందులో ఉన్న పేషెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాల డ్రైవర్ల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు తిరువనంతపురం పోలీసులు. కేరళ రాజధానిలోని బిజీ కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కాన్వాయ్ రాంగ్ రూట్లో వచ్చింది. అక్కడి ట్రాఫిక్ పోలీసులు మంత్రి కాన్వాయ్‌కు దారిచ్చేందుకు ట్రాఫిక్స్ను మళ్లించే ప్రయత్నం చేశారు. అంతలో అటుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ సరైన దారిలోనే వచ్చింది. కానీ రోడ్డు మధ్యలో ఒక బైకు ఆగి ఉండడంతో దానిని తప్పించుకుని వెళ్ళింది. అది గమనించని మినిస్టర్ కాన్వాయ్ వాహనం అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. వెంటనే అంబులెన్స్ పల్టీ కొట్టింది. అదృష్టావశాత్తు అక్కడే ఉన్న పోలీసు తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు. కాన్వాయ్ వాహనం తర్వాత మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో వారు కూడా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కానీ అంబులెన్స్‌లోని పేషెంటుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు అక్కడి పోలీసులు. మంత్రి కాన్వాయ్ వాహనాన్నినడిపిన డ్రైవరును అంబులెన్స్ డ్రైవరును ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. The convoy of Kerala Education Minister V. Sivankutty hit an ambulance and bike, but a case has been registered against the ambulance driver as well. VIP culture and a sense of Entitlement aren't going anywhere. That's lip-service. pic.twitter.com/NYLjhiRjMI — BALA (@erbmjha) July 14, 2023 ఇది కూడా చదవండి: కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే! -
మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్కి తప్పిన ప్రమాదం
చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి నడింపల్లి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని కార్యక్రమాలను ముగించుకుని మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు. ఈ క్రమంలో మంత్రికి కాన్వాయ్‌గా వస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డుకు అటువైపున దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సమీక్షించి అనంతరం మంత్రి కాన్వాయ్‌కు మరమ్మతులను నిర్వహించి, అక్కడ నుంచి తిరుపతికి తరలించారు. -
మంత్రి కాన్వాయ్ ఢీ కొని బాలుడి మృతి
-
మంత్రి కారే నా బిడ్డను బలితీసుకుంది
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో శనివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు ఐదేళ్ల బాలుడిని బలితీసుకుంది. అయితే ప్రమాదం తర్వాత కూడా వాళ్లు ఆపకుండా వెళ్లిపోవటం మరింత విమర్శలకు దారితీస్తోంది. బాలుడు తండ్రి విశ్వనాథ్ చెబుతున్నకథనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఐదళ్ల శివ తన తల్లి, అత్తతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో కొలనెల్‌గంజ్-పరసాపూర్ మార్గం గుండా మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కాన్వాయ్ అటుగుండా వెళ్తోంది. ఇంతలో ఓ కారు బాలుడిని ఢీకొట్టగా.. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ప్రమాదం జరిగాక కూడా వాహనం ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాలుడి తండ్రి విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొలనెల్‌గంజ్ పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. మంత్రి ప్రయాణిస్తున్న కారే తన బిడ్డను బలితీసుకుందని, ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వనాథ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. శివ కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించటంతోపాటు.. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ కార్యాలయం ట్విట్టర్లో తెలిపింది. #UPCM श्री #YogiAdityanath ने परिजनों को 5 लाख रुपये की आर्थिक सहायता उपलब्ध कराये जाने के निर्देश दिए। — CM Office, GoUP (@CMOfficeUP) October 28, 2017 -
మంత్రి కాన్వాయ్కి తప్పిన ప్రమాదం
కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్పల్లి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్తున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.