Minister convoy
-
AP: మంత్రి కాన్వాయ్ కోసం.. అంబులెన్స్‌ను ఆపేశారు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను పోలీసులు ఆపేశారు. మంత్రి కాన్వాయ్ వెళ్లే వరకు అంబులెన్స్‌ను వదలలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి సత్య ప్రసాద్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. వారి వాహన శ్రేణి వెళ్లే క్రమంలో పందిమెట్ట జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాలు వెళ్లే వరకు చేయి అడ్డుపెట్టి అంబులెన్సును ట్రాఫిక్ పోలీసులు నిలిపివేయించారు.టీడీపీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్.. కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులుమరోవైపు, నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తీరుతో ఆరుగురు విద్యార్థులు సొమ్ముసిల్లి పడిపోయారు. తాను ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే తీసుకురాగా, ఎండ తీవ్రతకు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. విద్యార్థులను కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లోపలికి ఎవరిని రానివ్వకుండా ఎమర్జెన్సీ వార్డు తలుపులను టీడీపీ నేతలు మూసేశారు. -
రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్
తిరువనంతపురం: మంత్రి కాన్వాయ్‌లోని వాహనం వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో పేషెంట్‌ను తీసుకుని వెళ్తోన్న అంబులెన్స్ తిరగబడింది. అందులో ఉన్న పేషెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాల డ్రైవర్ల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు తిరువనంతపురం పోలీసులు. కేరళ రాజధానిలోని బిజీ కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కాన్వాయ్ రాంగ్ రూట్లో వచ్చింది. అక్కడి ట్రాఫిక్ పోలీసులు మంత్రి కాన్వాయ్‌కు దారిచ్చేందుకు ట్రాఫిక్స్ను మళ్లించే ప్రయత్నం చేశారు. అంతలో అటుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ సరైన దారిలోనే వచ్చింది. కానీ రోడ్డు మధ్యలో ఒక బైకు ఆగి ఉండడంతో దానిని తప్పించుకుని వెళ్ళింది. అది గమనించని మినిస్టర్ కాన్వాయ్ వాహనం అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. వెంటనే అంబులెన్స్ పల్టీ కొట్టింది. అదృష్టావశాత్తు అక్కడే ఉన్న పోలీసు తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు. కాన్వాయ్ వాహనం తర్వాత మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో వారు కూడా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కానీ అంబులెన్స్‌లోని పేషెంటుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు అక్కడి పోలీసులు. మంత్రి కాన్వాయ్ వాహనాన్నినడిపిన డ్రైవరును అంబులెన్స్ డ్రైవరును ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. The convoy of Kerala Education Minister V. Sivankutty hit an ambulance and bike, but a case has been registered against the ambulance driver as well. VIP culture and a sense of Entitlement aren't going anywhere. That's lip-service. pic.twitter.com/NYLjhiRjMI — BALA (@erbmjha) July 14, 2023 ఇది కూడా చదవండి: కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే! -
రావెల కార్యక్రమం రసాభాస
- బోనబోయిన వర్సెస్ గింజుపల్లి వర్గీయులు ఘర్షణ - రెండు వర్గాల వీరంగం - మంత్రి కాన్వాయ్‌ను నిలిపిన ప్రత్తిపాడు కార్యకర్తలు - సర్దుబాటు చేసిన మంత్రి విద్యానగర్/కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా జిల్లాకు వచ్చిన రావెల కిషోర్ బాబుకు స్వాగతం పలికే సందర్బంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్ మండల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది. హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి కిషోర్ బాబుకు నగరశివారులోని నాగార్జున యూనివర్సిటీనుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. నగంరలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే మంత్రి కాన్వాయ్‌లో మా వాహనం ముందుండాలంటే, మా వాహనం ముందుండాలనే విషయంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరారామప్రసాద్ తనయుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది క్రమంగా శృతి మించి ఘర్షణకు దారితీసింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అనుచరులను వెంకటేశ్వరరావు అనుచరులు ప్రశ్నించి మంత్రి కాన్వాయ్ ముందు ఘర్షణకు దిగారు. ఒక దశలో మంత్రి కాన్వాయ్‌ను నిలిపి కార్ల బాయినెట్పైకి ఎక్కి రచ్చరచ్చ చేశారు. ఇరువర్గాలు ఆగ్రహావేశాలలో మంత్రి కాన్వాయ్ ముందు బైఠాయించి, మంత్రి దీనిపై సమాధానం చెప్పాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి. ఘర్షణ ఎంతకీ సమసిపోకపోవడంతో మంత్రి రావెల కారు దిగి వచ్చి ఇరువర్గాలకు నచ్చచెప్పారు. దీంతో సమస్య సద్దుమణిగింది. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన వివాదంతో ఆర్టీసి బస్టాండ్ నుంచి ఇటు ఆటోనగర్‌కు, ఇటు పొన్నూరు రోడ్డు వరకు ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.