AP: మంత్రి కాన్వాయ్‌ కోసం.. అంబులెన్స్‌ను ఆపేశారు | Ambulance Was Stopped By Police For The Convoy Of Minister Satya Prasad | Sakshi
Sakshi News home page

AP: మంత్రి కాన్వాయ్‌ కోసం.. అంబులెన్స్‌ను ఆపేశారు

Aug 15 2024 1:45 PM | Updated on Aug 15 2024 2:32 PM

Ambulance Was Stopped By Police For The Convoy Of Minister Satya Prasad

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కాన్వాయ్‌ కోసం అంబులెన్స్‌ను పోలీసులు ఆపేశారు. మంత్రి కాన్వాయ్‌ వెళ్లే వరకు అంబులెన్స్‌ను వదలలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి సత్య ప్రసాద్‌, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. వారి వాహన శ్రేణి వెళ్లే క్రమంలో పందిమెట్ట జంక్షన్ వద్ద  ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాలు వెళ్లే వరకు చేయి అడ్డుపెట్టి అంబులెన్సును ట్రాఫిక్‌ పోలీసులు నిలిపివేయించారు.

టీడీపీ ఎమ్మెల్యే ఓవర్‌ యాక్షన్‌.. కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులు
మరోవైపు, నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తీరుతో ఆరుగురు విద్యార్థులు సొమ్ముసిల్లి పడిపోయారు. తాను ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే తీసుకురాగా, ఎండ తీవ్రతకు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. విద్యార్థులను కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లోపలికి ఎవరిని రానివ్వకుండా ఎమర్జెన్సీ వార్డు తలుపులను టీడీపీ నేతలు మూసేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement