Satya Prasad
-
కూటమి సర్కార్ హంగామా.. సచివాలయంలో కొత్త గేటు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో సోకులు ఎక్కువయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై లేని శ్రద్ధ.. హంగు ఆర్భాటాలపై ఎక్కువైంది. తాజాగా సచివాలయంలో చంద్రబాబు రాకపోకల సమయంలో ప్రజలను నియంత్రించేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.ఏపీలో సచివాలయంలో జనాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ గోడ నుంచి పార్క్ వరకు ఇనుప గేట్ల ఏర్పటుకు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త గేటు ఏర్పాట్లు చూసి సచివాలయ ఉద్యోగులు విస్తుపోతున్నారు. సీఎం సెక్యూరిటీ కోసం అంటూ ఇబ్బడిముబ్బడిగా నిధులు ఖర్చు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే వాస్తు పేరుతో మంత్రుల పేషీల్లో వాస్తు పేరుతో అధికారులు హంగామా చేశారు. కాగా, మంత్రుల బాటలోనే ఓఎస్డీలు కూడా నడుస్తున్నారు. రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ఓఎస్డీ కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. మంత్రి పేషీలో కాకుండా అదనంగా పేషీ కేటాయించారు. హంగు ఆర్భాటాలతో మంత్రి ఓఎస్డీకి కొత్త ఛాంబర్‌ను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. -
బాధ్యత మరచిన మంత్రి అనగాని.. ఫారిన్లో ఎంజాయ్!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విజయవాడ ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. విజయవాడ జల దిగ్బంధం కావడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ వారం రోజుల పాటు వరద నీటిలోనే కాలం వెళ్లదీశారు. ఇక, వరద బాధితులను పట్టించుకోవడంతో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది.మరోవైపు.. ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి నేతలు, మంత్రులు మాత్రం ఫారిన్ టూర్, హైదరాబాద్ టూర్లలో బిజీ ఉన్నారు. అయితే, విజయవాడలో వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావని అనుకుంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ వెళ్లారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈమేరకు వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావనీ అనుకుంటూ సింగపూర్ చెక్కేసిన టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. విజయవాడ వరదల్లో 60 మందికిపైగా చనిపోయినా పట్టించుకోకుండా సింగపూర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ఎంజాయ్. బాధ్యత మరిచి.. షికార్లతో కాలయాపన చేస్తున్నారని కామెంట్స్ చేసింది. వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావనీ అనుకుంటూ సింగపూర్ చెక్కేసిన @JaiTDP మంత్రి అనగాని సత్యప్రసాద్ విజయవాడ వరదల్లో 60 మందికిపైగా చనిపోయినా పట్టించుకోకుండా సింగపూర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ఎంజాయ్ బాధ్యత మరిచి.. షికార్లతో కాలయాపన#BabuMadeDisaster#VijayawadaFloods… pic.twitter.com/FgIDbkmKwA— YSR Congress Party (@YSRCParty) September 14, 2024 ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
AP: మంత్రి కాన్వాయ్ కోసం.. అంబులెన్స్‌ను ఆపేశారు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను పోలీసులు ఆపేశారు. మంత్రి కాన్వాయ్ వెళ్లే వరకు అంబులెన్స్‌ను వదలలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి సత్య ప్రసాద్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. వారి వాహన శ్రేణి వెళ్లే క్రమంలో పందిమెట్ట జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాలు వెళ్లే వరకు చేయి అడ్డుపెట్టి అంబులెన్సును ట్రాఫిక్ పోలీసులు నిలిపివేయించారు.టీడీపీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్.. కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులుమరోవైపు, నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తీరుతో ఆరుగురు విద్యార్థులు సొమ్ముసిల్లి పడిపోయారు. తాను ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే తీసుకురాగా, ఎండ తీవ్రతకు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. విద్యార్థులను కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లోపలికి ఎవరిని రానివ్వకుండా ఎమర్జెన్సీ వార్డు తలుపులను టీడీపీ నేతలు మూసేశారు. -
మంత్రి అనగాని అరాచకం.. సామాన్యుడి ఇల్లు కూల్చివేత
-
ఉసూరుమనిపించారు.. రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ
సాక్షి, అమరావతి: విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పక్కదారి పట్టింది. కీలకమైన విభజన అంశాలపై కాకుండా ఇతర అంశాలపై అత్యధిక సమయం వెచ్చించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాలు సాగిన భేటీలో ఏ విషయంపై కూడా ఓ అంగీకారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇరు రాష్ట్రాల మంత్రులతో రెండు కమిటీలు వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సమయం అంతా డ్రగ్స్, సైబర్ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై కేటాయించడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ రెండు వారాల్లోగా సమావేశమై చర్చలు జరపనుంది. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చిస్తుందని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీ నిర్ణయాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించనున్నారు. వీరి స్థాయిలో కూడా ఫలితం తేలకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ భేటీ అయ్యి చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు.సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు ప్రశ్నలపై దాటవేతపోలవరం ముంపు మండలాలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై చర్చించారా అని ఇరు రాష్ట్రాల మంత్రులను విలేకరులు ప్రశ్నించగా.. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. నేరుగా సమాధానం ఇవ్వకుండా అన్ని విషయాలు చర్చించామన్నారు. విలేకరులు మరో ప్రశ్న వేస్తుండగానే సమావేశం ముగించి వెళ్లిపోయారు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహూకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వెంకటేశ్వరస్వామి ఫొటో బహూకరించి, రేవంత్, భట్టిలకు చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్, ఇతర అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపానని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందన్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేయడానికి కలిసి పనిచేస్తాంపదేళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. వీటి పరిష్కార మార్గం కోసం కలిసి పని చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడం కోసం సీఎస్ స్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఇంకో కమిటీ వేశాం. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రెండు వారాల్లోగా సమావేశం అవుతుంది. ముందుగా అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలను చర్చిస్తాం. అక్కడ ఫలితం రాకపోతే ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు ఉంటాయి. మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే తిరిగి ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్‌ను అరికట్టడం వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకొని అందుకోసం ఏడీజీ స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏడీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్న కోరికను అంగీకరించింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలను అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నాం.– తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపిల్లల స్కూల్ బ్యాగుల్లో గంజాయివిభజన చట్ట సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్చలతో సత్వరం పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తాం. ఇరు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెందేలా తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. తెలంగాణ కోరిన విధంగా రాష్ట్రంలో గంజాయి సరఫరా నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశాం. ఏపీలో 8వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతోంది. ఏపీలో అత్యధికంగా సాగవుతున్న గంజాయి తమ రాష్ట్రానికి వస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు హర్షించేలా విభజన సమస్యలను పరిష్కరిస్తాం.– ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
అనగాని ఇలాకాలో ఆగని విధ్వంసం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి చేరింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా చితక బాదుతున్నారు. ఊళ్లు వదలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అధికారం అండతో కూటమి నేతలు, ప్రధానంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతుండటంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు తున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి. విలేకరి ఇల్లు కూల్చివేత చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో బుధవారం ఉదయం టీడీపీ నేతలు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి యెనుముల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చివేశారు. వెంకటేశ్వరరావు నాలుగేళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ నేతలు జేసీబీతో వచ్చి ఆయన ఇంటిని కూల్చివేశారు.టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్సార్సీపీకి రావడానికి విలేకరి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయనను బెదిరించిన టీడీపీ నేతలు బుధవారం అతడి ఇంటిని కూల్చివేశారు. గ్రామకంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారనేది టీడీపీ ఆరోపణ. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలామంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరావు మూడేళ్ల క్రితం వేరొకరి వద్ద 4 సెంట్ల స్థలం కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి భార్య శ్యామల పేరున విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆక్రమణలు అనుకుంటే అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా గృహాలు నిర్మించారనుకుంటే అందరికీ నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కానీ.. టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. తన ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు విలేకరి Ððవెంకటేశ్వరరావు ప్రయతి్నంచినా పోలీసులు స్పందించలేదు. వెంకటేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు కూల్చడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ల ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. అలాగే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కె.కన్నప్పరాజు, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఎన్నికను రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మలసాని మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అఫిడవిట్లో తన ఆదాయం, వృత్తి వివరాలను తెలపాల్సి ఉండగా వీరు పొందుపర్చలేదన్నారు. అనగాని సత్యప్రసాద్ కూడా ఆదాయ వివరాలు పేర్కొనలేదని తెలిపారు. వాస్తవాలను దాచి వీరు అఫిడవిట్ దాఖలు చేశారని, ఎన్నికల నిబంధనలకు ఇది విరుద్ధమని మనోహర్‌రెడ్డి వివరించారు. -
టీడీపీలో కలకలం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి తేరుకోక ముందే వరుసగా తగులుతున్న షాక్‌లు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనం కాగా తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీకి చెందిన గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతతో సమావేశమై చర్చించడం, ఇటీవలే పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావును కలవడంతో కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితమే బీజేపీలో చేరిన గరికపాటి మోహనరావు ఆయన్ను దగ్గరుండి బీజేపీ అగ్రనేత వద్దకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. సత్యప్రసాద్‌తోపాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సత్యప్రసాద్ దీన్ని ఖండించారు. పది రోజుల్లోపే మరికొందరు కూడా! ఇటీవలే బీజేపీలో చేరిన చంద్రబాబు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని బీజేపీలో చేర్చేందుకు సుజనా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కమలం గూటికి చేరుకోనున్నట్లు నాలుగు రోజులుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది. తాను బీజేపీలో చేరడం లేదని గంటా పైకి చెబుతున్నా మరికొందరు ఎమ్మెల్యేలను కూడగట్టి పార్టీని వీడేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీమోహన్, గద్దె రామ్మోహన్, మద్దాల గిరి తదితరులు కూడా టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారం పది రోజుల్లోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఏలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ, పామర్రు ప్రాంతానికి చెందిన టీడీపీ నేత కృష్ణబాబు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. బాబు వ్యూహాత్మక మౌనం టీడీపీలో ఇంత జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన వ్యూహం ప్రకారమే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లు బీజేపీలో చేరినట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినా స్పందించకపోవడం, అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయకపోవటాన్ని బట్టి ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతోందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. వ్యక్తిగత పనుల మీదే ఢిల్లీకి: ఎమ్మెల్యే సత్యప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఖండించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వచ్చానని, ఈ విషయమై పార్టీ వర్గాలకు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి సన్నిహితుడైన గరికపాటి ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో పరామర్శించేందుకు వచ్చినట్టు తెలిపారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారడం సరికాదని, రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం వారి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు. బీజేపీలో లంకా చేరిక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆ పార్టీకి రాజీనామా చేసి తాజాగా బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అవమానాలపై కాపు నేతల్లో ఆగ్రహం టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు బుధవారం నిర్వహించిన సమావేశానికి తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ తదితరులు గైర్హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం ఈ వర్గం కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమై పార్టీలో తమ సామాజికవర్గానికి అవమానాలు జరుగుతున్నాయని, అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తమను పట్టించుకోలేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి? టీడీపీలోనే కొనసాగితే తమ పరిస్థితి ఏమిటనే అంశంపై సమాలోచనలు జరిపారు. చంద్రబాబు భజన ఆపాలని తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు
ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు కూడా నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సం బంధించిన పూర్తి వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు... పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయ వాది ఎ.సత్యప్రసాద్ వాదనలు విని పిస్తూ... టెక్ మహీంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవు పై వెళ్లాలని వేధిస్తోందని చెప్పారు. దీనిపై రంగా రెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందన్నారు. కార్మిక శాఖకు చేసిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగా ఉద్యోగులను తొల గించరాదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 47(2) స్పష్టం చేస్తోందన్నారు. ఇటీవల పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొల గిస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమి షనర్ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్య ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న జడ్జి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
విశాఖ ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద సిబ్బంది ఆందోళన సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలు మూత విశాఖపట్నం , న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లాలోనూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు. ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది విధులను బహిష్కరించారు. జెన్కో ఉద్యోగులంతా సీలేరు జలవిద్యుత్ కేంద్రం మెయిన్‌గేటు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. నాలుగింట 505 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ మహారాణిపేటలోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ఆ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ ఇ.గణపతి మాట్లాడుతూ పేరివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు విషయంలో ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. 2014 నూతన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరిమితి లేకుండా వైద్యఖర్చులు చెల్లించాలన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని కోరారు. అనంతరం ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సత్యనారాయణ, ఉప కన్వీనర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. మాచ్‌ఖండ్ సిబ్బంది ఆందోళన ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఆదోళన చేశారు. పీఆర్సీని అమలు చేయాలని జలవిద్యుత్ కేంద్రం కార్మిక, ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఈ కార్యలయం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్ సమస్యను ప్రభుత్వం అమలు చేయకుంటే అత్యవసర సేవలు స్తంభింప చేస్తామని హెచ్చరించారు.