సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో సోకులు ఎక్కువయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై లేని శ్రద్ధ.. హంగు ఆర్భాటాలపై ఎక్కువైంది. తాజాగా సచివాలయంలో చంద్రబాబు రాకపోకల సమయంలో ప్రజలను నియంత్రించేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీలో సచివాలయంలో జనాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ గోడ నుంచి పార్క్ వరకు ఇనుప గేట్ల ఏర్పటుకు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త గేటు ఏర్పాట్లు చూసి సచివాలయ ఉద్యోగులు విస్తుపోతున్నారు. సీఎం సెక్యూరిటీ కోసం అంటూ ఇబ్బడిముబ్బడిగా నిధులు ఖర్చు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే వాస్తు పేరుతో మంత్రుల పేషీల్లో వాస్తు పేరుతో అధికారులు హంగామా చేశారు. కాగా, మంత్రుల బాటలోనే ఓఎస్‌డీలు కూడా నడుస్తున్నారు. రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ఓఎస్‌డీ కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. మంత్రి పేషీలో కాకుండా అదనంగా పేషీ కేటాయించారు. హంగు ఆర్భాటాలతో మంత్రి ఓఎస్‌డీకి కొత్త ఛాంబర్‌ను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment