secratariate
-
ఏపీ సచివాలయంలో బడి పిల్లలు
-
కూటమి సర్కార్ హంగామా.. సచివాలయంలో కొత్త గేటు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో సోకులు ఎక్కువయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై లేని శ్రద్ధ.. హంగు ఆర్భాటాలపై ఎక్కువైంది. తాజాగా సచివాలయంలో చంద్రబాబు రాకపోకల సమయంలో ప్రజలను నియంత్రించేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.ఏపీలో సచివాలయంలో జనాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ గోడ నుంచి పార్క్ వరకు ఇనుప గేట్ల ఏర్పటుకు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త గేటు ఏర్పాట్లు చూసి సచివాలయ ఉద్యోగులు విస్తుపోతున్నారు. సీఎం సెక్యూరిటీ కోసం అంటూ ఇబ్బడిముబ్బడిగా నిధులు ఖర్చు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే వాస్తు పేరుతో మంత్రుల పేషీల్లో వాస్తు పేరుతో అధికారులు హంగామా చేశారు. కాగా, మంత్రుల బాటలోనే ఓఎస్డీలు కూడా నడుస్తున్నారు. రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ఓఎస్డీ కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. మంత్రి పేషీలో కాకుండా అదనంగా పేషీ కేటాయించారు. హంగు ఆర్భాటాలతో మంత్రి ఓఎస్డీకి కొత్త ఛాంబర్‌ను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. -
సచివాలయంలో సీఎం కేసీఆర్ తో వీఆర్ఏల జేఏసీ భేటీ
-
జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ భవనం వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్ధం కాబోతోంది. ఈ దసరా నాటికే పూర్తిచేసి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా.. పనుల్లో ఆలస్యం వల్ల కుదరని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని నిర్మాణ సంస్థ కోరినట్టు తెలిసింది. ఇటీవల సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ పనులను తనిఖీ చేసిన సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఈ అంశంపై చర్చ జరిగింది. దసరా నాటికి సచివాలయాన్ని ప్రారంభించాలని సీఎం పేర్కొనగా.. ఆలోగా భవనం పైభాగంలో పలు పనులు పూర్తయ్యేలా లేవని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారని.. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దసరా నాటికే పూర్తికావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. తీరు మారకుంటే ఎలాగని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే కేవలం పైభాగంలో కొన్నిపనులే జరగాల్సి ఉన్నందున, దసరా నాటికి కొత్త సచివాలయాన్ని ప్రారంభించుకోవచ్చని, పైభాగంలో పనులతో పెద్దగా ఇబ్బంది ఉండదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్టు సమాచారం. మూడు నెలలు సమయమిస్తే అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దసరా నాటికి భవనాన్ని ప్రారంభిస్తారా, నిర్మాణ సంస్థ కోరిన గడువిచ్చి అన్ని పనులు పూర్తయ్యాకే ప్రారంభిస్తారా అన్నదానిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాన గుమ్మటంలో జాప్యంతో! కొత్త సచివాలయాన్ని ఏడంతస్తుల్లో, 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దిగువ భాగంలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంతర్గతంగా తుది పనులు నడుస్తున్నాయి. కొన్ని అంతస్తుల్లో చాంబర్లను కూడా సిద్ధం చేశారు. త్వరలో ఫర్నీచర్ కూడా రాబోతోంది. భవనం వెలుపల ధోల్పూర్ ఆగ్రా ఎర్రరాతిని బేస్‌మెంట్‌గా పరిచే పని జరుగుతోంది. మరోవైపు తలుపులు, కిటికీలు, వాటికి అద్దాలు బిగించే పని కూడా మొదలైంది. ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తి కానున్నాయి. కానీ భవనంపైన ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తున్న పర్షియన్ శైలి గుమ్మటం పనులు ఇటీవలే మొదలయ్యాయి. దీన్ని హడావుడిగా నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని.. జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. వరుస ఆటంకాలతో.. కొత్త సచివాలయం నిర్మాణం ప్రారంభించినప్పుడు 2021 దసరా నాటికే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వరుస ఆటంకాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. భారీ భవనం అయినందున పునాదులను లోతుగా తవ్వారు. ఈ సమయంలో కఠినమైన రాయి రావడం, కంట్రోల్ బ్లాస్టింగ్ చేసి తొలగించాల్సి రావడంతో సమయం వృధా అయింది. తర్వాత కరోనా లాక్ డౌన్లతో పనులు ఆగిపోయాయి. కూలీలు తిరిగి వచ్చి పనులు గాడినపడేందుకు నెలల సమయం పట్టింది. రాజస్థాన్ ధోల్పూరు గనుల నుంచి ఆగ్రా ఎర్రరాయి, లేత గోధుమ రంగు రాయిని తెప్పించడం కోసం సమయం పట్టింది. వేగంగా పూర్తిచేసేందుకు కూలీల సంఖ్యను రెట్టింపు చేసి.. 2,800 మందిని వినియోగిస్తున్నారు. -
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం భవనాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని గురువారం ఆయన సందర్శించి పనులను పరిశీలించారు. పనుల వేగం, పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అధికారుల కృషిని అభినందించారు. మంత్రి, అధికారులు, నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను పరిశీలిస్తూ అప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలిచ్చారు. సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగి..తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర పనులకు సూచనలు చేశారు. ఎలివేషన్ ప్రకాశవంతంగా ఉండాలి సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడళ్లను అధికారులు ప్రదర్శించి చూపారు. వాటి నాణ్యత, కలర్, డిజైన్లను పరిశీలించిన సీఎం.. ఎలివేషన్ ప్రకాశవంతంగా, అందంగా కనిపించేలా చూడాలన్నారు. తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ఫైనల్ చేశారు. మోడల్ వాటర్ ఫౌంటెయిన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను కేసీఆర్ పరిశీలించారు. కాగా స్కై లాంజ్ నిర్మాణం గురించి సీఎంకు అధికారులు వివరించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం ఇదే విధంగా ముందుకు కొనసాగించాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్అండ్బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో.. -
తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం
సాక్షి, హైదరబాద్: గ్రేటర్ నగరంలో విష సర్పాలు బుసలు కొడుతున్నాయి. విస్తరిస్తోన్న కాంక్రీట్ జంగిల్, చెట్ల నరికివేత..బ్లాస్టింగ్..తదితర అభివృద్ధి ప్రక్రియలతో విషసర్పాలకు ఆవాస సమస్య తలెత్తి పుట్టల్లోంచి బయటకు వస్తున్నాయి. బహుళ అంతస్తుల భవంతులు, అపార్ట్మెంట్లు, విల్లాలు వెలుస్తుండడంతో పాముల మనుగడ కూడా ప్రశ్నార్థకమౌతోంది. గతేడాదిగా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల పాములను సంరక్షించారు. వీటిలో సుమారు 4 వేల వరకు గ్రేటర్ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇందులోనూ 60 శాతం విషసర్పాలున్నాయి. కాగా మంగళవారం సచివాలయం (బీఆర్కే భవన్)లో ఒక నాగుపాము కనిపించడంతో కలకలం మొదలైంది. ఉద్యోగులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. సొసైటీ సభ్యులు అక్కడికి చేరుకునేలోగానే పాము భవన్ సమీపంలో ఉన్న కలుగులో నుంచి వెళ్లిపోయిందని..దానిని పట్టుకోవడం సాధ్యపడలేదని స్నేక్ సొసైటీ కార్యదర్శి అవినాష్ ‘సాక్షి’కి తెలిపారు. పాముల జాగాలో మనుషుల ఆవాసాలు.. ⇔ ఒకప్పుడు పాములు మనుగడ సాగించిన ప్రాంతాల్లో ఇప్పుడు బహుళ అంతస్తుల భవంతులు..గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తుండడంతో పాముల సహజసిద్ధమైన ఆవాసాలు దెబ్బతింటున్నాయి. ⇔ ప్రధాన నగరంలోని జూబ్లీహిల్స్‌తోపాటు శివార్లలోని గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, నెక్నాంపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, వనస్థలిపురం, సాగర్‌రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో పాముల సంఖ్య పెరిగింది. ⇔ వీటిలో విషసర్పాలుగా పేరొందిన నాగుపాము లు, స్పెక్టకిల్డ్ కోబ్రా, రస్సెల్ వైపర్, కామన్ కైరా ట్, స్కా స్కేల్డ్ వైపర్ వంటి విషసర్పాలే అధికం. ⇔ జనావాసాల్లోకి పాములు వస్తే 8374233366 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ తెలిపారు. -
దేవుడికి ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని, మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సచివాలయంలోని మసీదు కూల్చివేతపై సయ్యద్ యాసన్, మహమ్మద్ ముజాఫరుల్ల, ఖాజా అజ్జాజుదీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కూల్చివేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. 657 గజాలు ఉన్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగులు స్థలం కేటాయించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడా కూలిపోయిందని ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ఖర్చుతో నూతన మసీదును నిర్మిస్తామని చెప్పారు. మసీదును ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే నూతనంగా మసీదు నిర్మాణం చేపట్టాలని పిటీషనర్లు కోరారు. గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని తెలిపింది. ప్రజా అవసరాల కోసం మసీదులని కుల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ప్రభుత్వాలు ఆ పని చేయవని తెలిపింది. అవసరమైతే కూల్చిన ప్రదేశానికి సంబందించి నష్ట పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదు కూల్చితపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. -
కశ్మీర్లో మువ్వన్నెల రెపరెపలు
న్యూఢిల్లీ: రాష్ట్ర సచివాలయ భవనంపై ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్ర జెండాను అధికారులు తొలగించారు. ఆర్టికల్ 370 రద్దు పూర్తయ్యి మూడు వారాలు అవుతున్న క్రమంలో దీన్ని తొలగించడం గమనార్హం. వాస్తవానికి జమ్మూ కశ్మీర్ జెండాను అక్టోబర్ 31న తొలగించాల్సి ఉన్నప్పటికీ అధికారులు ముందుగానే తొలగించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీన్ని తొలగించనున్నామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయానికి కేవలం మువ్వన్నెల భారత జెండా మాత్రమే ఎగురుతూ కనిపించింది. 1952, జూన్ 7 నుంచి రెండు జెండాలు ఎగిరేలా ఆర్టికల్ 370 వీలు కల్పించిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో నిత్యావసరాలకు, మందులకు దిగుల్లేదని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ అన్నారు. ప్రజలకు అవసరమైన ముడి సరుకులు అన్నింటిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సమాచార వ్యవస్థను నిలిపివేయడం ద్వారా ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. కశ్మీర్లో పరిస్థితులు అసాధారణం: రాహుల్ కేంద్రం చెబుతున్నట్లు కశ్మీర్లో పరిస్థితులు సాధారణంగా లేవని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల బృందం శనివారం కశ్మీర్‌ను సందర్శించడానికి ప్రయత్నించగా అధికారులు వారిని శ్రీనగర్ విమానాశ్రయంలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. శ్రీనగర్‌లో తమ బృందం ఎదుర్కొన్న పరిస్థితులను రాహుల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కశ్మీరీలకున్న స్వాతంత్య్రం కోల్పోయి 20 రోజులు అవుతోందన్నారు. -
కొత్త సచివాలయానికి 27న శంకుస్థాపన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది! విశ్వసనీయ వర్గాల సమా చారం ప్రకారం ఈ నెల 27న కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 27 తర్వాత నుంచి మూడు నెలల వరకు సుముహూర్తాలేవీ లేకపోవడంతో 27వ తేదీనే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయ కార్యాలయాలు కలిగిన ఏ, బీ, సీ, డీ బ్లాకుల భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించడానికి వీలుగా ఏపీ ప్రభుత్వ అధీనంలోని సచివాలయ భవనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ అధీనంలో ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను తమకు అప్పగించాలని ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర విభజన అనంతరం సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణకు, ఎల్, జే, హెచ్, కే బ్లాకులను ఏపీకి కేటాయించారు. ఏపీ అధీనంలోని బ్లాకుల అప్పగింత పూర్తయిన వెంటనే తెలంగాణ సచివాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలను ఈ భవనాలకు తరలించి ఏ, బీ, సీ, డీ బ్లాకులను ఖాళీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఖాళీ చేసిన ఏ, బీ, సీ, డీ బ్లాకుల భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా ఏపీ భవనాల అప్పగింత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. సత్వరమే భవనాలు అప్పగించండి: సీఎస్ హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను సత్వరమే తమ రాష్ట్రానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి కోరారు. ప్రధానంగా సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను వీలైనంత త్వరగా అప్పగించాలని ఆయన పేర్కొన్నారు. ఏపీ అధీనంలో ఉన్న భవనాల అప్పగింత అంశంపై సోమవారం ఆయన సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఎక్స్ అఫీషియో) ఎల్. ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావులతో సమావేశమై చర్చించారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో భవనాల అప్పగింత ప్రక్రియ వేగిరం చేయాలని సీఎస్ ఎస్కే జోషి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా సమావేశానికి హాజరైన ప్రేమ్‌చంద్రారెడ్డిని కోరారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఏపీ అధీనంలో ఉన్న భవనాలను తమకు అప్పగిస్తే కొత్త భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకుంటామని సీఎస్ పేర్కొన్నట్లు తెలిసింది. ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణ సాధారణ పరిపాలన శాఖకు, ఏపీ అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యే క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని సీఎస్ సూచించారు. భవనాల అప్పగింత అంశాన్ని తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దృష్టికి తీసుకెళ్తామని, తమ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ప్రేమ్‌చంద్రారెడ్డి తెలంగాణ సీఎస్‌కు తెలిపారు. సచివాలయంలోని జే బ్లాక్ భవన సముదాయం నుంచి ఫైళ్లు, ఇతర సామగ్రిని సోమవారం ఏపీ అధికారులు రెండు వాహనాల్లో నింపి తమ రాష్ట్రానికి తరలించారు. దీనిపై ‘సాక్షి’ప్రేమ్‌చంద్రారెడ్డిని సంప్రదించగా ఏపీకి కేటాయించిన భవనాలను ఖాళీ చేసి తెలంగాణకు అప్పగించాలని తనకు ఇప్పటివరకు ఎలాంటి సూచనలు అందలేదన్నారు. ఏపీ ప్రభుత్వశాఖలు తమ ఫైళ్లను స్వరాష్ట్రానికి తరలించుకోవడం కొత్త విషయం కాదన్నారు. -
సాగర తీరానే సచివాలయం!
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణంపై గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్ వీడుతోంది. ప్రస్తుత సచివాలయం ఉన్న హుస్సేన్‌సాగర్ తీరంలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కొత్త సచివాలయ సముదాయాన్ని బైసన్‌పోలో మైదానంలో నిర్మించాలని సర్కారు భావించినప్పటికీ, ఆ మైదానాన్ని కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సచివాలయంలో సగం భవనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఆ భవనాలను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకుని, కొత్త సెక్రటేరియట్ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘బైసన్‌పోలో’కు కేంద్రం విముఖత... తెలంగాణ సచివాలయ భవన సముదాయం ఘనంగా ఉండటంతోపాటు అన్ని విభాగాలు ఒక్కచోటే ఉండేలా ఏర్పాటు చేయాలని, అది అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గతంలోనే నిర్ణయించారు. ప్రస్తుత సచివాలయ భవన సముదాయం అందుకు అనుకూలంగా లేదని భావించారు. వాస్తు ప్రకారం కూడా అది సరిగా లేదని ఆయన దృష్టికి వచ్చింది. దీంతో మరోచోట కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించి.. తొలుత ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి స్థలాన్ని ఎంపిక చేశారు. అందులోని ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ట్రాఫిక్ పరంగా ఆ ప్రాంతం ఇబ్బందిగా ఉంటుందన్న భావనతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానం పక్కనే ఉన్న బైసన్‌పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించారు. అది రక్షణ శాఖ ఆధీనంలో ఉండటంతో ఆ స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీతో సమావేశమైన సందర్భంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ విషయంలో రక్షణమంత్రికి విజ్ఞప్తులు చేశారు. అయితే, ఇందుకు పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు అభ్యంతరం చెప్పాయి. దాదాపు కోటి జనాభాతో కిటకిటలాడుతున్న హైదరాబాద్‌లో ఖాళీ స్థలాలు లేకపోవడం, పచ్చదనం బాగా తక్కువగా ఉండి పర్యావరణపరంగా సమస్యలు ఏర్పడుతున్న విషయాన్ని ప్రస్తావించాయి. అందులోనే జింఖానా క్రికెట్ మైదానం ఉండటంతో క్రీడా సంఘాలు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కనపెట్టింది. అయితే, ఎలాగైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బైసన్‌పోలో మైదానాన్ని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన అప్పటి రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ను రక్షణశాఖ విశ్రాంత సిబ్బంది కుటుంబాలతోపాటు పర్యావరణ సంఘాల ప్రతినిధులు కలిసి, బైసన్‌పోలో మైదానాన్ని సచివాలయం కోసం కేటాయించొద్దని కోరారు. ఈ విషయాన్ని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం వ్యవహరించదని అప్పుడు ఆమె హామీ ఇచ్చారు. అనంతరం వారి వినతులకు ప్రధానికి సమర్పించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి రావడంతో బైసన్‌పోలో ప్రతిపాదనకు సానుకూల స్పందన వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయ భవనాలున్న ప్రాంతంలోనే కొత్త భవనాలు నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చిందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి చెప్పారు. హఫీజ్ కాంట్రాక్టర్‌తో కొత్త ప్లాన్... కొత్త సచివాలయం సాధారణ భవనాలుగా కాకుండా తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఆధునికంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌కు డిజైన్ రూపకల్పన బాధ్యతను గతంలోనే అప్పగించారు. ఆ మేరకు ఆయన రెండు ప్లాన్లు సిద్ధం చేశారు. ఇందులో ఓ ప్లాన్‌ను స్వయంగా ముఖ్యమంత్రే మీడియాకు వివరించారు. ఇప్పుడు ఆ ప్లాన్లకు స్వల్పంగా మార్పు చేసి కొత్త ప్లాన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆయన్ను కోరినట్టు సమాచారం. ఇక ప్రస్తుత సచివాలయం ఉన్న స్థలంలోనే పనులు ప్రారంభిస్తే, సెక్రటేరియట్‌ను తాత్కాలికంగా మరోచోటకు తరలించాల్సిన అవసరం లేకుండానే నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. రెండు దశల్లో నిర్మాణం.. ప్రస్తుతం సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. శిథిలావస్థలో ఉన్న పురాతన హెరిటేజ్ జీ బ్లాక్ కాకుండా హెచ్, జే, కే, ఎల్ బ్లాకులు ఏపీ ఆధీనంలో ఉన్నాయి. ఈ భవనాలు తిరిగి తెలంగాణ పరిధిలోకి రానున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత తెలంగాణ కార్యాలయాలను హెచ్, జే, కే, ఎల్ భవనాల్లోకి తరలిస్తారు. అనంతరం ఏ, బీ, సీ, డీ బ్లాకులు ఉన్న భవనాలను కూల్చివేసి అక్కడ ప్రధాన భవనాల నిర్మాణం చేపడతారు. అవి పూర్తయిన తర్వాత కార్యాలయాలను కొత్త భవనాల్లోకి తరలించి.. హెచ్, జే, కే, ఎల్ సముదాయాలను కూల్చివేసి అక్కడ పనులు చేపడతారు. ఈ విధంగా సచివాలయాన్ని మరోచోటుకు తరలించకుండానే రెండు దశల్లో పనులు పూర్తిచేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను రోడ్లు, భవనాల శాఖ గతంలోనే ముఖ్యమంత్రికి సమర్పించింది. వాటికి ఆయన ఆమోదం తెలిపితే దాన్నే అమలు చేసే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత సచివాలయ ప్రాంగణం 24 ఎకరాల్లో ఉంది. అందులో వాస్తును సరిద్దేందుకు రోడ్ల అలైన్‌మెంట్‌ను మార్చడం, ఇతరత్రా అవసరా>ల కోసం నాలుగు ఎకరాల స్థలం అవసరమని సమాచారం. దీంతో ఆ నాలుగు ఎకరాలు తీసేయగా, మిగిలిన 20 ఎకరాల్లో కొత్త భవనాలు నిర్మిస్తారు. అయితే వీటి నిర్మాణానికి భారీగా వ్యయం చేయాల్సి ఉన్నందున ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. -
సచివాలయంలో ఉద్యోగుల నిరసన ర్యాలీ
అమరావతి : సచివాలయంలో శుక్రవారం ఉద్యోగుల నిరసన ర్యాలీకి దిగారు. ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలంటూ మూడో బ్లాక్ వద్ద ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. అన్యాయంగా ఏపీని విభజన చేశారని మండిపడ్డారు. విభజన హామీలకోసం పార్లమెంటులో ఎంపీలు పోరాడుతున్నారని, హామీలు నెరవేర్చకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. -
మహారాష్ట్ర సచివాలయంలో ఆత్మహత్య
ముంబై: మహారాష్ట్ర మంత్రాలయం (సచివాలయం)లో ఓ వ్యక్తి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ముంబైలోని మంత్రాలయంలో రెండ్రోజుల క్రితం ఓ 32 ఏళ్ల యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువకముందే గురువారం హర్షల్ రౌత్ (45) అనే వ్యక్తి ఐదో అందస్తునుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. చెల్లి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న హర్షల్ ఇటీవలే పదిరోజుల పెరోల్‌పై బయటకొచ్చాడు. పెరోల్ ముగింపునకు ఒకరోజు ముందు (గురువారం సాయంత్రం) సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని విషయాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, తాజా ఘటనలపై విపక్షపార్టీలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. మంత్రాలయం.. ఆత్మహత్యల అడ్డాగా మారిందని విమర్శించాయి. -
సచివాలయంలో కోడ్ ఉల్లంఘన
డీ బ్లాక్‌లో కిరణ్ ఫ్లెక్సీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోనే యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడి పది రోజులు కావస్తున్నా ఇంకా సచివాలయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీ దర్శనమిస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రత్యేకించి అన్ని శాఖలకు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు, నేతల ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, వాహనాల నుంచి తొలగించాలని ఆదేశించారు. అయినా సచివాలయంలో అధికారులు అమలు చేయలేదు. డీ బ్లాక్‌లోకి ప్రవేశించగానే కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీ దర్శనమిస్తోంది. ఆర్థికశాఖ వెబ్సైట్లో ఆ శాఖ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫొటోలతోపాటు గతంలో ఆర్థికశాఖలో పనిచేసిన ఐఏఎస్ అధికారుల ఫొటోలు కూడా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో మాజీ సీఎం, మాజీ మంత్రుల ఫొటోలతో కూడిన ప్రభుత్వ క్యాలెండర్లు దర్శనమిస్తున్నాయి. 2009 ఎన్నికలప్పుడు నాటి సీఈఓ ఐవీ సుబ్బారావు.. ప్రభుత్వ క్యాలెండర్‌పై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో కనిపించకుండా తెల్లకాగితంతో కవర్ చేశారు. ఇప్పుడు మాత్రం మాజీ సీఎం, మాజీ మంత్రుల ఫొటోలతో కూడిన క్యాలెండర్లు యథాతథంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాయి.