సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విజయవాడ ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. విజయవాడ జల దిగ్బంధం కావడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ వారం రోజుల పాటు వరద నీటిలోనే కాలం వెళ్లదీశారు. ఇక, వరద బాధితులను పట్టించుకోవడంతో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది.
మరోవైపు.. ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి నేతలు, మంత్రులు మాత్రం ఫారిన్ టూర్, హైదరాబాద్ టూర్‌లలో బిజీ ఉన్నారు. అయితే, విజయవాడలో వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావని అనుకుంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ వెళ్లారని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈమేరకు వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా..‘వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావనీ అనుకుంటూ సింగపూర్ చెక్కేసిన టీడీపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. విజయవాడ వరదల్లో 60 మందికిపైగా చనిపోయినా పట్టించుకోకుండా సింగపూర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ఎంజాయ్. బాధ్యత మరిచి.. షికార్లతో కాలయాపన చేస్తున్నారని కామెంట్స్ చేసింది.
వరదలు వస్తాయని తెలిసినా.. జనం చస్తే చావనీ అనుకుంటూ సింగపూర్ చెక్కేసిన @JaiTDP మంత్రి అనగాని సత్యప్రసాద్
విజయవాడ వరదల్లో 60 మందికిపైగా చనిపోయినా పట్టించుకోకుండా సింగపూర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ఎంజాయ్
బాధ్యత మరిచి.. షికార్లతో కాలయాపన#BabuMadeDisaster#VijayawadaFloods… pic.twitter.com/FgIDbkmKwA— YSR Congress Party (@YSRCParty) September 14, 2024
ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment