
లెవల్ క్రాసింగ్‌ల వద్ద భయం.. భయం
గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగులు ప్రమాదభరితంగా మారాయి. వీటి వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రజలు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు.
మామిడికోళ్ల - కౌతవరం, గాదేపూడి, గుడ్లవల్లేరు బీరయ్య చెరువు డొంక రోడ్డు, నాగవరం, వడ్లమన్నాడు గ్రామాల్లో ఈ రైల్వేక్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఢీకొని పశువులు చనిపోతున్నాయి. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. - , గుడ్లవల్లేరు