మైనర్‌ బాలికపై లైంగిక దాడి..కామాంధుడు అరెస్ట్‌  | Police Have Arrested Man For Sexual Assault On Minor Girl | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై లైంగిక దాడి..కామాంధుడు అరెస్ట్‌ 

Published Mon, Feb 1 2021 8:54 AM | Last Updated on Mon, Feb 1 2021 8:54 AM

Police Have Arrested Man For Sexual Assault On Minor Girl - Sakshi

భవానీపురం(విజయవాడ పశి్చమ): విద్యాధరపురం లేబర్‌ కాలనీలో ఒక మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని దిశ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న బాధితురాలి వైద్య పరీక్షల నివేదికను బట్టి సోమవారం రిమాండ్‌కు పంపించనున్నట్లు తెలిసింది. స్థానికుల కథనం మేరకు.. బాలిక ఇంట్లో కేబుల్‌ రాకపోవడంతో స్థానికంగా కేబుల్‌ ఆపరేటర్‌గా ఉంటున్న నిందితుడు ఎస్‌కే అయాజ్‌ ఇంటికి శనివారం వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అయాజ్‌ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన కుమార్తె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లి వెతుకులాట మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న నిందితుడు బాలికను తన ఇంటి భవనం నుంచి రెండు భవనాలపై నుంచి తీసుకువెళ్లి మూడో ఇంటి భవనంలో దించాడు. అది చూసిన ఎదురింటివారు బాలిక తల్లికి చెప్పారు. గబగబా వచ్చిన ఆమె కుమార్తె పరిస్థితి చూసి గాబరాపడి ఇంటికి తీసుకువెళ్లి ఏం జరిగిందని అడిగి తెలుసుకోవడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు.. 
నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నాయని, అందులో అత్యాచారం కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే బాధితులతో రాజీ చేసుకుని మహిళా సెషన్స్‌ కోర్టులో నాలుగు కేసులు కొట్టేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు పశి్చమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు కావడం, బాధితురాలి మేనమామ టీడీపీ నాయకుడు కావడంతో టీడీపీ వర్గాలు రాజీ చేసేందుకు ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది.   

     

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement