![Cm Revanth Reddy Is Serious About The Incident Of Assault In Peddapalli District](/styles/webp/s3/article_images/2024/06/14/CMrevanthreddy4.jpg.webp?itok=ZRQ_H98Q)
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన అమానుష ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.
మరో వైపు, నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment