Ayesha Takia's Husband Alleges CISF Officer Tried to Touch Her at Airport - Sakshi
Sakshi News home page

Ayesha Takia: హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. న్యాయం కావాలంటున్న భర్త

Published Mon, Apr 11 2022 1:33 PM | Last Updated on Mon, Apr 11 2022 4:56 PM

Ayesha Takia Husband Alleges CISF Officer Tried To Touch Her At Airport - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ అయేషా టాకియాకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో ఓ అధికారి అయేషాను అసభ్యంగా తాకాడని స్వయంగా ఆమె భర్త ఫర్హన్‌ అజ్మీ సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. సొంత దేశంలోనే ఇలా జరగడం అవమానంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ..'డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో 'ఇండిగో 6E 6386' విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సిద్దమయ్యాం.

ఎయిర్‌పోర్టులో  ఆర్‌పీ‌సింగ్, ఏకే యాదవ్ అనే ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు నన్ను, నా కుటుంబాన్ని అడ్డగించారు.  నా పేరు గట్టిగా పలుకుతూ వాళ్ల టీమ్ మెంబర్స్‌తో వెకిలిగా ప్రవర్తించారు. సెక్యూరిటీ చెక్ కోసం లైన్‌లో నిలబడితే సెక్యూరిటీ డెస్క్‌లోని ఓ పురుష అధికారి నన్ను, నా ఫ్యామిలీని వేరువేరు లైన్‌లో నిలబడమని సూచిస్తూ ఆయేషా ఒంటిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళలను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని నేను అడిగాను. దూరంగా ఉండాలని కోరాను.

ఈ గొడవ తర్వాత మళ్లీ నన్ను తనిఖీ చేస్తున్నప్పుడు కూడా డర్టీగా సెక్సువల్ కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి మాకు న్యాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నా అంటూ ట్వీట్‌లో వివరించాడు. ఇది కాస్తా వైరల్‌ కావడంతో స్పందించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు.. 'ప్రయాణంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం' అని హామీ ఇచ్చారు. కాగా ఆయేషా తెలుగులో సూపర్‌ సినిమాతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement