పాపం.. హీరోయిన్ ఒక్క ఫొటో ఎంత పనిచేసింది! | Actress Ayesha Takia Deactivates Instagram After Trolling | Sakshi
Sakshi News home page

Ayesha Takia: ఘోరమైన ట్రోలింగ్.. తట్టుకోలేకపోయిన హీరోయిన్

Aug 23 2024 1:35 PM | Updated on Aug 23 2024 1:42 PM

Actress Ayesha Takia Deactivates Instagram After Trolling

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. దీని బారిన పడి ఇబ్బందులు పడినవాళ్లు ఈపాటికే బోలెడు మంది ఉ‍న్నారు. ఇప్పుడీ లిస్టులో మరో హీరోయిన్ చేరింది. నాగార్జున-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'సూపర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయేషా టాకియా తాజాగా నెటిజన్ల దెబ్బకు బలైపోయింది. ఏకంగా ఇన్ స్టా అకౌంట్‪‌నే డిలీట్ చేసేంత వరకు వెళ్లింది.

(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)

ముంబయికి చెందిన ఆయేషా టాకియా.. 2004-11 మధ్య హిందీలో పలు సినిమాలు చేసింది. సల్మాన్, అజయ్ దేవగణ్, సంజయ్ దత్ లాంటి స్టార్స్‌తో కలిసి సినిమాలు చేసింది. 2009లో పెళ్లి చేసుకుని.. ఓ రెండేళ్ల తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. అప్పటినుంచి ఎప్పుడో ఓసారి కనిపిస్తుండేది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కొడుకుతో కలిసి కనిపించింది.

అయితే ఈమె గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని చెప్పి ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ తాకిడికి తట్టుకోలేకపోయిన ఆయేషా.. ఏకంగా తన ఇన్ స్టా ఖాతానే డిలీట్ చేసి పడేసింది. ఈ ట్రోలింగ్ అంతా కాస్త సద్దుమణిగిన తర్వాత వస్తే రావొచ్చేమో! ఏదేమైనా ఇలా ట్రోల్ చేసి మరీ హీరోయిన్‌ని హడలగొట్టేశారు!

(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement