Goa Airport
-
గోవాలో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. హైదరాబాద్ నుంచి 180మందితో..
సాక్షి, హైదరాబాద్: గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గోవా ఇండిగో ఫ్లైట్ వెళ్లింది. అక్కడ ల్యాండింగ్ సమయంలో రన్‌వే పైకి మరో విమానం దూసుకొచ్చింది. దీంతో ఇండిగో విమానం ల్యాండ్ అయిన 15 సెకన్లలోనే మళ్లీ టేకాఫ్ అయింది. గాల్లోనే 20 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో సేఫ్‌గా ల్యాండ్ అయింది. చదవండి: (జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు) -
'సూపర్' హీరోయిన్‌కు చేదు అనుభవం.. ఎయిర్‌పోర్టులో లైంగిక వేధింపులు
బాలీవుడ్ హీరోయిన్ అయేషా టాకియాకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో ఓ అధికారి అయేషాను అసభ్యంగా తాకాడని స్వయంగా ఆమె భర్త ఫర్హన్ అజ్మీ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. సొంత దేశంలోనే ఇలా జరగడం అవమానంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ..'డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో 'ఇండిగో 6E 6386' విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సిద్దమయ్యాం. ఎయిర్‌పోర్టులో ఆర్పీసింగ్, ఏకే యాదవ్ అనే ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు నన్ను, నా కుటుంబాన్ని అడ్డగించారు. నా పేరు గట్టిగా పలుకుతూ వాళ్ల టీమ్ మెంబర్స్‌తో వెకిలిగా ప్రవర్తించారు. సెక్యూరిటీ చెక్ కోసం లైన్లో నిలబడితే సెక్యూరిటీ డెస్క్‌లోని ఓ పురుష అధికారి నన్ను, నా ఫ్యామిలీని వేరువేరు లైన్లో నిలబడమని సూచిస్తూ ఆయేషా ఒంటిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళలను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని నేను అడిగాను. దూరంగా ఉండాలని కోరాను. ఈ గొడవ తర్వాత మళ్లీ నన్ను తనిఖీ చేస్తున్నప్పుడు కూడా డర్టీగా సెక్సువల్ కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి మాకు న్యాయం అందించాలని డిమాండ్ చేస్తున్నా అంటూ ట్వీట్లో వివరించాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో స్పందించిన ఎయిర్పోర్ట్ అధికారులు.. 'ప్రయాణంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం' అని హామీ ఇచ్చారు. కాగా ఆయేషా తెలుగులో సూపర్ సినిమాతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. Altercation started when an armed male officer at the security desk tried to physically touch & tell my wife, son to stand in another line while all other families were standing together for sucurity.All I said to him is to dare touch any female her & maintain distance @CISFHQrs — Farhan Azmi (@abufarhanazmi) April 4, 2022 -
గోవా రాకుండా సల్మాన్‌పై నిషేధం!
గోవా: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ అభిమాని పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గోవా ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సల్మాన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఆయన చెప్పకపోతే.. గోవా రాకుండా ఆయనపై నిషేధం విధించాలని సీఎం ప్రమోద్ సావంత్‌ను కోరింది. గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర సావైకర్ కూడా సల్మాన్ తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం మంగళవారం ఉదయం సల్మాన్ గోవా విమానాశ్రయం వచ్చారు. డిపార్చర్ గేటు నుంచి బయటకు వస్తుండగా ఆయన ముందు నిలబడి ఓ ఎయిర్‌పోర్టు ఉద్యోగి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. తనను ఏమాత్రం అడగకుండా సెల్ఫీలు దిగుతుండటంతో ఆగ్రహానికి లోనైన సల్మాన్ అతని ఫోన్ లాక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
పనాజీ: గోవాదబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఒక పెద్ద ప్రమాదం తప్పింది. రన్‌వేపై అకస్మాత్తుగా వీధికుక్కలు దర్శనమివ్వడంతో,అప్రమత్తమైన పైలట్ చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను నిలిపివేశారు. ఈ మేరకు భారత నావికాదశం ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబై నుంచి గోవాకు వస్తున్న ఎయిరిండియా ప్యాసింజర్ విమానం (ఏఐ033) నిన్న (ఆగస్టు13, మంగళవారం తెల్లవారుజామున) ఈ ఘటన చోటు చేసుకుంది. చీకటిగా ఉండటంతో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సిబ్బంది కుక్కలను గమనించ లేపోయారని తెలిపింది. విమానాశ్రయం రన్‌వే సమీపంలో కుక్కలు, పక్షుల బెడదనుంచి బయటపడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని భారత నావికాదళం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. Indian Navy on Air India flight aborts landing in Dabolim (Goa) due to presence of dogs on runway: INS Hansa (near Dabolim) has taken proactive measures to reduce dog menace on runway with employment of manpower during daylight hours adjacent to runway to chase away dogs/birds. https://t.co/kMXV4hJBjH — ANI (@ANI) August 14, 2019 -
ఎయిర్‌పోర్టులో యువీ జంట ఏం చేసిందంటే..
-
ఎయిర్‌పోర్టులో యువీ జంట ఏం చేసిందంటే..
టీమిండియా ఆల్ రౌండర్, కొత్త పెళ్లికొడుకు యువరాజ్ సింగ్ మాంచి జోష్ మీదున్నాడు. బాలీవుడ్ నటి హజల్ కీచ్‌ను సిక్కు, హిందు సంప్రదాయం ప్రకారం రెండుసార్లు వివాహం చేసుకున్న యువరాజ్ డాన్స్‌లతో అదరగొడుతున్నాడు. అవకాశం, సందర్భం రావడం ఆలస్యమన్నట్టు చెలరేగిపోతున్నాడు. శుక్రవారం గోవాలో యువీ, హజల్లు హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు పాల్గొన్నారు. కాగా పెళ్లికి ముందు గోవా ఎయిర్‌పోర్టులో యువీ, హజల్లు డాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఈ జోడీ పోటీపడి భాంగ్రా డాన్స్ చేశారు. గోవాలో జరిగిన పెళ్లికి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ హాజరయ్యారు. గత బుధవారం చండీగఢ్ సమీపంలో యువీ, హజల్ సిక్కుల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కోసం హజల్ కీచ్ తన పేరును గుర్బసంత్ కౌర్‌గా మార్చుకుంది. ఈ వేడుకల్లో నూతన వధూవరులు డాన్స్‌లతో అతిథులను కనువిందు చేశారు. వీరితో కలసి విరాట్ కోహ్లీ కూడా చిందేశాడు. ఈ నెల 7న ఢిల్లీలో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. -
నోట్ల రద్దు: కన్నీళ్లు పెట్టిన విదేశీ మహిళ
పణజి: విదేశీ పర్యాటకులకూ నోట్ల కష్టాలు తప్పడం లేదు. పాత పెద్ద నోట్లను మార్చుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిన విదేశీ వనితకు ఓ మంచి మనిషి సాయం చేశాడు. పాత నోట్లు తీసుకుని ఆమెకు కొత్త నోట్లు ఇచ్చాడు. నవంబర్ 10న గోవా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సామాను ఎక్కువగా ఉండడంతో విదేశీ వనిత రూ.1600 చెల్లించాల్సి వచ్చింది. ఆమె దగ్గర రూ. 500, రూ. వెయ్యి నోట్లు మాత్రమే ఉండడంతో అవి తీసుకునేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించారు. చిల్లర ఇవ్వాలని చాలా మందిని ఆమె అడిగినా ఎవరూ ఇవ్వలేదు. ఏం చేయాలో పాలుపోక ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. విదేశీ మహిళ బాధను చూసిన ఓ వ్యక్తి ఆమెకు కొత్త రూ. 2 వేల నోటు ఇచ్చాడు. అయితే తర్జనభర్జన తర్వాత ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఈ నోటు తీసుకున్నారు. ఈ ఉదంతాన్ని బిహార్ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదశ్ రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్ వెలుగులోకి తెచ్చారు. దేశ ప్రజలకే కాకుండా విదేశీయులు కూడా నోట్ల కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలియజెప్పడానికే ఈ ఘటనను వెలుగులోకి తెచ్చినట్టు సంజయ్ తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలు కష్టాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. -
విమానం వాష్‌రూమ్‌లో బంగారుకొండ!
పణాజి: ఒక వేళ మీరుగానీ ఆ విమానంలో ప్రయాణించి ఉంటే.. అందులోని వాష్ రూమ్ లోకి వెళ్లుంటే.. ఆ మూలన ఉన్న చిన్నపాటి బంగారుకొండను చూసి అదిరిపోయేవారు. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా ఏడు కేజీల బంగారమది. ఓనరంటూ ఎవ్వరూలేని, ఓ నలుపు రంగు బ్యాగ్ లో దాగున్న ఆ బంగారాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం వాష్ రూమ్ లో లభించిన బంగారం ఎక్కడ్నుంచి వచ్చిందో ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. విమానం సిబ్బందేమో 'మాకు తెలియదంటే మాకు తెలియదు' అని తడుముకోకుండా చెబుతున్నారు. ఏదైనా విమానం ల్యాండ్ అయ్యాక, మళ్లీ టేకాఫ్ అయ్యే ముందు దానిని క్షుణ్నంగా తనిఖీ చేయడం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ రోజూ జరిగేదే. అలా బుధవారం ఖతార్ నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా టాయిలెట్ లో ఒక మూలన బంగారు ఆభరణాలతో నిండిన బ్యాగ్ దొరికింది అధికారులకు. బయటికి తీసుకొచ్చి తూస్తే వాటి బరువు 7.12 కిలోలుఉంది. విలువ ఎంతుందనేది లెక్కలుకట్టాక చెబుతామని, ఆలోపు ఈ బ్యాగ్ ఎవరిదో కనిపెడతామని చెప్పారు గోవా డివిజన్ కస్టమ్స్ కమిషనర్ అన్పజఖన్.