గోవా రాకుండా సల్మాన్‌పై నిషేధం! | NSUI demands apology from Salman Khan for phone-snatching incident | Sakshi
Sakshi News home page

గోవా రాకుండా సల్మాన్‌పై నిషేధం!

Published Wed, Jan 29 2020 9:21 AM | Last Updated on Wed, Jan 29 2020 9:22 AM

NSUI demands apology from Salman Khan for phone-snatching incident - Sakshi

గోవా: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ అభిమాని పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. గోవా ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ ఘటనపై ​కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సల్మాన్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఒకవేళ ఆయన చెప్పకపోతే.. గోవా రాకుండా ఆయనపై నిషేధం విధించాలని సీఎం ప్రమోద్‌ సావంత్‌ను కోరింది. గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర సావైకర్‌ కూడా సల్మాన్‌ తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తన తాజా సినిమా షూటింగ్‌ కోసం మంగళవారం ఉదయం సల్మాన్‌ గోవా విమానాశ్రయం వచ్చారు. డిపార్చర్‌ గేటు నుంచి బయటకు వస్తుండగా ఆయన ముందు నిలబడి ఓ ఎయిర్‌పోర్టు ఉద్యోగి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. తనను ఏమాత్రం అడగకుండా సెల్ఫీలు దిగుతుండటంతో ఆగ్రహానికి లోనైన సల్మాన్‌ అతని ఫోన్‌ లాక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement