
సాక్షి, హైదరాబాద్: గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గోవా ఇండిగో ఫ్లైట్ వెళ్లింది. అక్కడ ల్యాండింగ్ సమయంలో రన్‌వే పైకి మరో విమానం దూసుకొచ్చింది.
దీంతో ఇండిగో విమానం ల్యాండ్ అయిన 15 సెకన్లలోనే మళ్లీ టేకాఫ్ అయింది. గాల్లోనే 20 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో సేఫ్‌గా ల్యాండ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment