
భువనేశ్వర్: ట్రాన్స్ జెండర్లు రైళ్లలో ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులను వసూలు చేసే సంఘటనలను చూస్తూ ఉంటాం. అదే విధంగా తమను అల్లరి చేసిన వారిని నడిరోడ్డు మీదనే చితకబాదిన వార్తలు విన్నాం. కానీ, తాజాగా ఆరుగురు ట్రాన్స్ జెండర్లు ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఒడిశాలోని భరత్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ట్రాన్స్ జెండర్ల దాడిలో తీవ్రంగా గాయపడిని కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితులు.. రిని బెహరా, సాలిని దాస్, లోపా సేథి, దీపాలి నాయక్, సుని జెనాగా పోలీసులు గుర్తించారు. వారి మీద హత్య కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారనే కోణంలో ట్రాన్స్ జెండర్లపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment