'అత్యాచారం చేసి నగ్నంగా ఉన్న నన్ను'..‌‌ | Pop Singer Demi Lovato Reveales That She Was Raped At The Age of 15 | Sakshi
Sakshi News home page

15 ఏళ్లకే నాపై అత్యాచారం జరిగింది : పాప్‌ సింగర్‌‌‌‌

Published Wed, Mar 17 2021 7:04 PM | Last Updated on Wed, Mar 17 2021 8:04 PM

Pop Singer Demi Lovato Reveales That She Was Raped At The Age of 15  - Sakshi

ప్రముఖ పాప్‌ సింగర్‌, నటి డెమి లోవాటో షాకింగ్‌ విషయాలను బయటపెట్టింది. 2018లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని ఇంటికి వస్తుండగా, తనపై అత్యాచారం జరిగిందని, చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌గా భావించిన వ్యక్తే తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొంది. పీపుల్స్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డెమి ఈ విషయాలను వెల్లడించింది.  ఆ ఘటన జరిగినప్పుడు తన వయసు కేవలం 15 ఏళ్లేనని, దాని తర్వాత దాదాపు చనిపోదామని నిర్ణయించుకున్నానని, అయితే సన్నిహితుల సహకారంతో దాన్నుంచి బయటపడగలిగానని తెలిపింది. అతి తక్కువ కాలంలో పాప్‌ సింగర్‌గా డెమి రాణించిన సంగతి తెలిసిందే. 


'ఓ రోజు షూటింగ్‌ ముగించుకొని వస్తుండగా, సిరా మిచెల్ అనే ఫ్రెండ్‌ నాకు అతిగా హెరాయిన్‌ (డ్రగ్‌) ఇచ్చాడు. దీంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాను. దీన్ని అవకాశంగా మార్చుకొని నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పూర్తి నగ్నంగా ఉన్న నన్ను అక్కడే రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. ఈ ఘటన నన్ను మానసికంగా చాలా కుంగిపోయేలా చేసింది. ఎన్నో రోజులు దాని గురించే భాదపడుతూ..ఆఖరికి తిండి, మంచి నీళ్లు కూడా తీసుకునేదాన్ని కాదు. ఇంట్లోనే ఎప్పుడూ చీకటి గదిలోనే ఉండేదాన్ని.స్నేహితులు వచ్చినా కలిసేదాన్ని కాదు.


ఆ సంఘటన గురించి మర్చిపోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. లక్కీగా దాన్నుంచి బయటపడగలిగాను' అని డెమి పేర్కొంది. తన టాలెంట్‌తో ఇక్కడిదాకా వచ్చానని, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు ఏదో ఒక సమయంలో ఇలాంటివి ఎదుర్కొని ఉంటారని ఆ సమయంలో మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపింది. అయితే లైంగిక వేధింపులపై డెమి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సంచలనంగా మారాయి. 

చదవండి :  (ట్రాన్స్‌జెండర్‌గా మారిన హాలీవుడ్‌ స్టార్‌)
(దర్శకుడు టవల్‌ తీసేయమన్నాడు : నటి)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement