రేయ్! బట్టలూడదీయించి కొడతా..
చిత్తూరు ఆసుపత్రిలో టీడీపీ నేత దౌర్జన్య కాండ
వైద్యుడిని అందరిముందే కొట్టడానికి వెళ్లిన వైనం
చిత్తూరు (అర్బన్): ‘రేయ్..! ఆసుపత్రిలో బ్లేడు లేకుండా ఎందుకున్నావ్‌రా..? బట్టలూడదీయించి కొడతా..! నా కొ...కా! మీ సూపరింటెండెంట్‌ను ఇండెంట్ పెట్టుకుని బ్లేడు కొనుక్కోమను..’ అధికారపార్టీకి చెందిన ఓ నేత వాడిన భాష ఇది. ఇదీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సాటి వైద్యులు, నర్సులు, స్వీపర్లు అందరూ చూస్తుండగానే సీనియర్ వైద్యుడిని నానా దుర్భాషలాడి కొట్టడానికి వెళ్లారు. విషయం మరో టీడీపీ ప్రజాప్రతినిధి వరకు వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాము మరో రకంగా వెళ్లాల్సి వస్తుందని ఆయన హెచ్చరించడం అధికారపార్టీ నాయకుల దౌర్జన్యకాండకు అద్దం పడుతోంది.
అసలేం జరిగింది?
చిత్తూరులో మంగళవారం రాత్రి ఓ మహిళను ద్విచక్ర వాహనం ఢీ కొంది. తలకు గాయం అవడంతో ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ తలకు కుట్లు వేయాల్సిందిగా డ్యూటీ డాక్టర్ పురుషోత్తం ఆదేశించారు. ఇంతలో ఆమె బంధువులు తాము వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళతామని చెప్పారు. సరేనని తలకు కుట్లు వేసుకోండని చెప్పి ఆయన వెళ్లిపోయారు. వెంట్రుకలు కత్తెరతో తీస్తే సరిగా ఉండదని, బ్లేడు తీసుకొస్తే గాయం వద్ద వెంట్రుకలు తొలగించి కుట్లు వేస్తానని వార్డు బాయ్ చెప్పాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న టీడీపీ నాయకుడు బ్లేడు తీసుకురమ్మన్న విషయం తెలుసుకుని శివాలెత్తాడు. బ్లేడు కూడా లేకుండా ఆసుపత్రిలో ఏం వైద్యం చేస్తున్నావని 65 ఏళ్ల వయస్సున్న సీనియర్ వైద్యుడిపై చేయిచేసుకోవడానికి వెళ్లాడు. రాయడానికి వీల్లేని పదాలతో బూతు పురాణం అందుకున్నాడు. 35 ఏళ్లకు పైగా వైద్యుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఈయన ప్రస్తుతం ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్య సేవ లు అందిస్తున్నారు. అత్యవసర విభాగంలో అప్పటికే డ్యూటీలో ఉన్న సిబ్బం టది, వైద్యులు, రోగుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్ డాక్టర్ జరిగిన ఉదంతాన్ని ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాను పోలీసుల కు ఫిర్యాదు చేస్తానని, ఇన్నేళ్ల సర్వీసులో ఇంత నీచం గా ఎప్పుడూ తనకు అవమానం జరగలేదని సాటి వైద్యుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమై తే ఆసుపత్రిలో రాజీనామా చేస్తానని, టీడీపీ నే తపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి వెళ్లిపోయారు.
రంగంలోకి మరిది
విషయం తెలుసుకున్న చిత్తూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి మరిది రంగంలోకి దిగాడు. బుధవారం ఆసుపత్రిలో ఉన్నతాధికారులను తన ఇంటి వద్దకు పిలి పిం చాడు. ‘ ఏం యా.. టీడీపీ నాయకులంటే బొత్తిగా భ యం లేదయా మీకు. బ్లేడు, కత్తిరి పెట్టుకోకుండా ఏం చేస్తా ఉండారు..?’ అని ఎదురు ప్రశ్నిం చాడు. ‘ సరేలే మా వాడు ఏదో ఆవేశంలో అన్నాడు. వదిన మీకు చెప్పమనింది. ఆ డాక్టరు కంప్లైంట్ ఇవ్వకుండా చూసుకో. లేదంటే ఏం చేయాలో మాకూ తెలుసు, అర్థమైందా?’ అంటూ హెచ్చరించాడు. ఈ వ్యవహారంపై బుధవారం రాత్రి వర కు రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ వైద్యుడు మాత్రం నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.