
సాక్షి, హైదరాబాద్: ప్రేమికులుగా విడిపోయిన తర్వాత తన మాజీ బాయ్ ఫ్రెండ్ అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. పబ్‌లలో గిటారిస్ట్‌గా పని చేస్తున్న లలిత్ సెహెగల్‌కు 2016లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి (36)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.
ఇద్దరూ 2021 వరకు స్నేహితులుగా ఉన్నారు. అదే ఏడాది ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి.. ఎవరికి వారే వేర్వేరుగా ఉంటున్నారు. కొంత కాలంగా సదరు యువతి లలిత్ సెహగల్ స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతోందని, ఈ విషయంపై నిలదీసేందుకు గచ్చిబౌలిలోని హాస్టల్‌లో ఉంటున్న లలిత్ సెహెగల్.. యువతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చాడు.
చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్..
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో గొడవపడ్డారు. ఈ సమయంలోనే తన దుస్తులను చించేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు లలిత్ సెహగల్‌పై ఐపీసీ సెక్షన్ 376 రెడ్‌విత్ 511, 323, 354, 509ల కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment