ఉదయం డబ్బులు అడగ్గా తల్లి ఇచ్చింది.. మళ్లీ సాయంత్రం వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వమని అడగడంతో లేవని తల్లి చెప్పగా ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు. తల్లితో గొడవపడుతుందని తెలుసుకుని అతడి అక్క రాగా ఆమెపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.
అహ్మదాబాద్ వెజాల్‌పూర్ ప్రాంతంలోని ఉదయ్ సొసైటీలో చైతలి శ్రీమలి నివసిస్తోంది. ఆమె భర్త, తండ్రి మూడు నెలల కిందట మృతిచెందారు. ఒక్కతే ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు కూతురు మధు, కుమారుడు జిగర్ ఉన్నారు. అయితే ఆదివారం ఉదయం తల్లి వద్దకు కుమారుడు జిగర్ వచ్చి రూ.10 వేలు అడిగాడు. తల్లి కాదనకుండా ఇచ్చింది. అయితే సాయంత్రానికి వచ్చి మళ్లీ రూ.10 వేలు కావాలని కోరాడు. దీంతో తల్లి లేవని చెప్పింది. లేవని ఎంత చెప్పినా వినకుండా తల్లితో జిగర్ గొడవపడ్డాడు. దీంతో కోపంతో తల్లి శ్రీమలిపై గొడవపడుతూ కొట్టాడు.
ఈ విషయం తెలుసుకున్న అతడి సోదరి మధు ఇంటికి వచ్చింది. తల్లిని అతడి బారి నుంచి కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అతడు అక్కపై కూడా దాడికి పాల్పడ్డాడు. తల్లి, అక్కపై జిగర్ తీవ్రంగా దాడి చేశాడు. తల్లిని అద్దాలకేసి కొట్టాడు. ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో తల్లి, అక్క ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కిటికీలకేసి బాదాడు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో వారిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు.
ఈ విషయం చుట్టుపక్కల వాళ్లు విషయం తెలుసుకోవడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికుల సమాచారంతో అంబులెన్స్ వచ్చి ఆస్పత్రికి వారిని తీసుకెళ్లింది. ప్రస్తుతం వారిద్దరూ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నిందితుడు జిగర్‌పై కుటుంబసభ్యులు వెజాల్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment