లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిపై స్థానిక పోలీసు విచక్షణా రహితంగా దాడి చేశాడు. సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసు మద్యం సేవించిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలోనే షూతో చెంప దెబ్బలు కొట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్ర రాజధాని లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్ధొయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
వీడియో ప్రకారం.. పోలీసు మార్కెట్ ప్రదేశంలోకి సివిల్ డ్రెస్‌లో వచ్చిప్పుడు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కనిపించాడు. బాధితునిపై పోలీసు షూతో దాడి చేశాడు. కేవలం 4 నిమిషాల వ్యవధిలో షూతో ముఖంపై 38 దెబ్బలు కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Watch: UP Cop In Trouble After Shocking Assault On "Drunk" Man https://t.co/6RthUUmPPZ pic.twitter.com/DSGEyQTWo3
— NDTV (@ndtv) July 23, 2023
దీనిపై స్పందించిన పోలీసులు బాధితుడు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పారు. బాధిత వ్యక్తిపై దాడి చేసిన సదరు పోలీసుని విధుల నుంచి తప్పించారు. ప్రజలతో గౌరవంగా నడుచుకోవాలని పోలీసులకు తెలిపారు. అయితే.. ఆ వ్యక్తి స్థానికంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న కారణంగానే తాను కొట్టాల్సి వచ్చిందని సస్పెన్ష్‌కు గురైన పోలీసు చెప్పారు.
ఇదీ చదవండి: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment