
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): మద్యం మత్తులోనున్న ఆకతాయిలు రెచ్చిపోయారు. ఐదుగురు విద్యార్థినులపై అత్యాచారానికి ప్రయత్నించారు. వివరాలు... స్థానిక ఎస్‌బీఐ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినులు బుధవారం రాత్రి 8 గంటలకు ట్యూషన్ ముగించుకుని ఇంటి దారి పట్టారు. రైలు పట్టాల సమీపంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు ఆకతాయిలు వారిని అటకాయించి నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లారు.
చదవండి: పక్కింటి యువకుడితో భార్య చనువుగా ఉంటుందని..
విద్యార్థినులతో పాటు ఉన్న ఏడేళ్ల చిన్నారిని ఎత్తుకుని చంపుతామంటూ బెదిరించి మిగిలిన వారిపై అత్యాచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో విద్యార్థినుల కేకలు విని ఓ వ్యక్తి అటుగా వెళ్లాడు. ఆకతాయిలతో గొడవపడి విద్యార్థినులను అక్కడి నుంచి పారిపోవాలని సైగ చేయడంతో వారు తప్పించుకున్నారు. కత్తులతో దాడి చేయబోగా విద్యార్థినులను కాపాడిన వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు వెంటనే అర్బన్ సీఐ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment