మాజీ ఎంపీ హర్షకుమార్, ఆయన అనుచరులపై తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజమండ్రి రూరల్: మాజీ ఎంపీ హర్షకుమార్, ఆయన అనుచరులపై తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. హర్షకుమార్ ఆయన అనుచరులు తమ పొలంలోకి చొరబడి నిర్మాణంలో ఉన్న షెడ్డును ఆపేయాలంటూ దౌర్జన్యం చేశారని కనమూరి రామలింగరాజు అనే వ్యక్తి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆడిటర్ భాస్కర్‌రామ్ కూడా తన పొలంలోని పాకను హర్షకుమార్, ఆయన అనుచరులు తొలగించారంటూ బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.