
వీరబల్లి మండలం ఒదివీడు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళపై టీడీపీ నేత పెద్ద రెడ్డయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
సాక్షి, అన్నమయ్య జిల్లా: వీరబల్లి మండలం ఒదివీడు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళపై టీడీపీ నేత పెద్ద రెడ్డయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగా అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డయ్య బాత్రూంలో దూరి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో అక్కడ నుండి నిందితుడు పరారయ్యాడు.
బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ వీరబల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయకపోగా, ఆమె పట్ల ఎస్‌ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తనకు న్యాయం జరగకపోతే చావేశరణ్యమని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.