వాషింగ్టన్: అమెరికాలో తరచూ చోటుచేసుకుంటు న్న కాల్పుల ఘటనలు మహమ్మారిలా మారాయని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇవి అంతర్జాయతీయంగా ఇబ్బందికరంగా తయార య్యాయని పేర్కొన్నారు. దేశంలో తుపాకీ హింస ను అరికట్టేందుకు ఆయన పలు చర్యలను ప్రకటిం చారు. ఇందులోభాగంగా దేశీయంగా తయారయ్యే కొన్ని రకాల తుపాకులపై నియంత్రణలను విధిం చడంతోపాటు అసాల్ట్ రైఫిళ్లపై గతంలో అమలైన నిషేధాన్ని తిరిగి కొనసాగించాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తేనున్నారు. ‘ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు కాంగ్రెస్ సభ్యులు సూచనలు చేశారు.
కానీ, తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేలా ఒక్క చట్టాన్ని కూడా ఆమోదించలేదు. కాంగ్రెస్ ఈ విష యంలో సానుకూలంగా స్పందించినా లేకున్నా తుపాకీ హింస నుంచి అమెరికా ప్రజలకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల ప్రత్యా మ్నాయాలను ఉపయోగించుకుంటాను’అని బైడెన్ గురువారం వైట్‌హౌస్ వద్ద మీడియా సమావేశంలో ప్రకటించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి వంటి కేసులపై విచారణ చేపట్టిన మాజీ అధికారి డేవిడ్ చిప్‌మ్యాన్‌ను బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆరŠమ్స్, ఎక్స్‌ప్లోజివ్స్(ఏటీఎఫ్) చీఫ్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు.
‘తుపాకీ కాల్పుల ఘటనలు మహమ్మారిలా మారాయి. అంతర్జాతీయంగా ఇబ్బందికరంగా, మనకు మాయని మచ్చలా తయారయ్యాయి. ఇది ఆగిపోవాలి’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి రోజూ 316 కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటుండగా 106 మంది చనిపోతున్నారు. ఆసియన్ అమెరికన్లపై జార్జియాలో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోగా కొలరాడోలో 10 మంది మృతి చెందారు. ఈ రెండు ఘటనలకు మధ్యలో కేవలం వారం వ్యవధిలోనే 850 కాల్పుల ఘటనలు సంభవించాయి.
ఈ ఘటనల్లో 250 చనిపోగా 500 మంది గాయపడ్డారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘యుద్ధాల్లో వాడే 100 రౌండ్లు, 100 బుల్లెట్ల సామర్థ్యం కలిగిన ఆయుధాలను పౌరులు కలిగి ఉండటంలో అర్థం లేదు. వాస్తవానికి వీటి అవసరం ఎవరికీ ఉండదు’ అని బైడెన్ తెలిపారు. ఈ సమావేశం అనంతరం కొద్దిసేపటికే టెక్సాస్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా ఐదుగురు గాయపడటం గమనార్హం. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ పోలీస్ కూడా కాల్పుల్లో గాయాలపాలయ్యాడు. బుధవారం సౌత్ కరోలినాలో ఒక వ్యక్తి ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురిని కాల్చి చంపాడు.
విభేదిస్తున్న ప్రతిపక్షం
‘తాజా నిబంధనలు రాజ్యాంగం రెండో సవరణ ప్రకారం తుపాకీ కలిగి ఉండే అమెరికన్ల హక్కులకు ఎలాంటి ఆటంకం కలిగించవు, వారి హక్కుకు హామీ ఇస్తుంది’ అని బైడెన్ తెలిపారు. తుపాకులపై గట్టి నియంత్రణలుండాలని అధికార డెమోక్రటిక్ పార్టీ సభ్యులు వాదిస్తుండగా, ప్రతిపక్ష రిపబ్లికన్లు మాత్రం ప్రజలకు తుపాకీ యాజమాన్య హక్కులుండాలని వాదిస్తున్నారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కూడా బైడెన్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తోంది. భారీ సంఖ్యలో మరణాలు సంభవించిన కాల్పుల ఘటనల్లో పలుమార్లు నిందితులు అసాల్ట్ రైఫిళ్లనే వాడారు. వీటి విక్రయంపై 1994 నుంచి 2004 వరకు నిషేధం అమల్లో ఉంది. అనంతరం ఈ నిషేధాన్ని పొడిగించకపోవడంతో ప్రస్తుతం అసాల్ట్ రైఫిళ్లపై ఎలాంటి నియంత్రలు లేవు.
ఘోస్ట్ గన్స్‌కు చెక్
కిట్లలో సులువుగా మార్కెట్లలో లభించే ఏఆర్–15 వంటి పిస్టళ్లను ఇంటి వద్దే అసెంబుల్ చేసుకుని, యథేచ్ఛగా వాడేసుకునే వీలుంది. రైఫిళ్లతో పోలిస్తే వీటిపై నియంత్రణలు తక్కువ. వీటి వినియోగం సులువు. తక్కువ పొడవుండే బారెళ్లతో ఉండే వీటిని వేగంగా రీలోడ్ చేయడం చేయెచ్చు. కొలరాడో ఘటనలో నిందితుడు వీటినే వినియోగించారు. ఇటువంటి వాటిని అధికారులు ఘోస్ట్ గన్స్‌గా పిలుస్తున్నారు.
వీటిపై ఎలాంటి నంబర్లు కానీ, ఇతర గుర్తింపు కానీ ఉండవు. ఎవరైనా వీటిని నేరాలకు పాల్పడేందుకు ప్రయోగిస్తే వాస్తవ యజమానులను గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇకపై వీటి లభ్యతను అడ్డుకునేందుకు వెంటనే నిబంధనలు తయారు చేయాలని అధ్యక్షుడు బైడెన్ న్యాయశాఖను ఆదేశించారు. దీంతోపాటు రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా సొంత చట్టాలను అమలు చేసేందుకు ‘రెడ్‌ఫ్లాగ్ లా’ ముసాయిదా తయారు చేయాలని కోరారు. ఇది అమల్లోకి వస్తే ప్రమాదకరమైన వ్యక్తుల వద్ద నుంచి ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకునే అధికారం కోర్టులు, అధికారులకు దఖలు పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment