బ్లడ్ డొనేట్ చేయనందుకు దాడి చేశారు | Boy 'Assaulted' Allegedly By BJD Men For Refusing To Donate Blood In Odisha | Sakshi
Sakshi News home page

బ్లడ్ డొనేట్ చేయనందుకు దాడి చేశారు

Published Sun, Jul 24 2016 10:29 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

బ్లడ్ డొనేట్ చేయనందుకు దాడి చేశారు

బ్లడ్ డొనేట్ చేయనందుకు దాడి చేశారు

కటక్: రక్త దానం చేయడానికి నిరాకరించినందుకు ఓ మైనర్ బాలుడిపై బిజు జనతాదళ్ (బీజేడీ) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.  ఒడిశాలోని కటక్ లో అధికారపార్టీ ఎమ్మెల్యే శనివారం  రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేట్ చేయడానికి కాలేజీ నుంచి కొంత మంది విద్యార్థులను బీజేడీ కార్యకర్తలు  బలవంతంగా మోటార్ బైక్ పై తీసుకెళ్లారు.

ఇందులో ఒక మైనర్ విద్యార్థి రక్తం ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో  బీజేడీ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. ఈ మేరకు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే ప్రవత్ బిశ్వాల్ ను ప్రశ్నించగా తాము ఎవరినీ బలవంతంగా రక్తదానం చేయడానికి పిలువలేదని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement