donate blood
-
చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..(ఫొటోలు)
-
పెళ్లంటే.. రక్తదానం..అవయవదానం..ఇదో వెరైటీ మ్యారేజ్..!
ఛత్తీస్‌గఢ్: ఎవరైనా పెళ్లంటే..బంధుమిత్రులతో ఘణంగా చేసుకోవాలని భావిస్తారు. పసందైన విందుతో అందరి మన్ననలను పొందాలని భావిస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ధమ్తారీ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి మాత్రం కాస్త విభిన్నంగా జరిగింది. సమాజానికి ఉపయోగపడేలా వివాహాన్ని కొత్తగా జరుపుకోవాలనుకున్నారు వధూవరులు.ఇంతకూ వారు ఏం చేశారంటే.. జిల్లాలోని కాండెల్ గ్రామంలో ముకేష్, నేహాల వివాహాం అందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది. పెళ్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వధూవరులు. వారి పెళ్లికార్డులపై కూడా రక్తదాన ప్రాముఖ్యతను పేర్కొన్నారు. వారిరువురు పెళ్లిలో రక్తదానం చేయడమే గాక అవయవదానం చేస్తామని కూడా ప్రమాణం చేశారు. బంధుమిత్రుల చేత కూడా ఈ ప్రమాణాన్ని చేపించారు. రక్తదానం చేయడానికి గ్రామవాసులందరు ముందుకు వచ్చారు. ఈ విభిన్నమైన కార్యక్రమంతో వీరి పెళ్లి ఆదర్శవంతంగా జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ధమ్తారీ జిల్లా స్వాతంత్య్రోద్యమంలోనే ప్రముఖంగా నిలిచింది. 1920లోనే గాంధీజీ సత్యాగ్రహాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇదీ చదవండి:పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి... -
రక్తదానం చేయాలనుకుంటున్నారా?
కొందరు వ్యక్తులు సమాజానికి ఏదైనా చేయాలనుకుంటారు. ఎంతో కొంత ఉపయోగపడాలనుకుంటారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టేనని భావించి... వాళ్ల పుట్టినరోజునాడో లేదా వారు ప్రత్యేకమని అనుకునే రోజుల్లో రక్తదానం చేస్తుంటారు. ఇలాంటి మానవీయ వ్యక్తులు రక్తదానం చేసే సమయంలో ఇది గుర్తుంచుకోండి. మీరు రక్తదానం చేయాలనుకున్నప్పుడు రక్తంలోని వివిధ కాంపోనెంట్స్‌ను విడదేసే సౌకర్యం ఆ బ్లడ్‌బ్యాంకులో ఉందా, లేదా అని వాకబు చేయండి. ఎందుకంటే... ఒక వ్యక్తి నుంచి మొత్తం రక్తాన్ని (హోల్ బ్లడ్‌ను) సేకరించి ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి పూర్తి రక్తాన్ని ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి, అవి వృథా అయిపోతాయి. కానీ... రక్తంలోని ఏ అంశం లోపించిందో నిర్దిష్టంగా అదే అంశాన్ని (అదే కాంపోనెంట్‌ను) ఎక్కించే ఆధునిక వసతి సదుపాయాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఒక వ్యక్తికి పూర్తి రక్తం కంటే ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీతన ఎక్కువగా ఉన్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగ్యూలాంటి వ్యాధి సోకి ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్లెట్లు ఎక్కిస్తే చాలు. ఇలా... రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో రక్తదానం చేస్తే... అప్పుడు ఒకరి నుంచి సేకరించిన హోల్‌బ్లడ్‌ను వివిధ అవసరాలు ఉన్న చాలామంది రోగులకు ఎక్కించి, ఒకరికంటే ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు నేరుగా ఏదైనా బ్లడ్‌బ్యాంకుకు వెళ్లడం కంటే.... రక్తాన్ని వివిధ కంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేయడం మంచిది. -
ఇలాచేస్తే.. షిర్డీలో ఏడాదిపాటు వీఐపీ దర్శనం
ముంబయి: ప్రసిద్ధ షిర్డీ ఆలయంలో సాయిబాబా దర్శనం కోసం క్యూలో నిల్చొని విసిగి పోయారా.. మీరు కూడా వీఐపీ దర్శనం కోరుకుంటున్నారా అయితే, మీకు ఇక ఆ చింతన అక్కర్లేదు. ఏం చక్కా ప్రతి ఒక్కరూ వీఐపీలాగే షిర్డీ సాయినాధున్ని దర్శించుకునే అవకాశాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కల్పిస్తోంది. అయితే, మీరు చేయాల్సిందల్లా కూడా ఒక్కటే.. అదే రక్తదానం. అవును.. షిర్డీ సాయినాధుని దర్శనానికి వెళ్లిన వారు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాదిపాటు ఆలయంలో వీఐపీ హోదాలో దర్శనం ఉండటంతోపాటు సత్రాల్లో బస విషయంలో కూడా వీఐపీ తరహాలోనే ఏర్పాటుచేస్తారు. సర్వ మానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ట్రస్టు చైర్మన్ సురేశ్ హారే మీడియాకు తెలిపారు. షిర్డీని బ్లడ్ బ్యాంక్ హబ్‌గా మార్చడం తమ ఉద్దేశమని చెప్పారు. ‘తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే. షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తాం’ అని ఆయన చెప్పారు. రక్తదానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తులు ఈ చర్యతో మానవతా దృక్పథాన్ని చాటుకోవడంతోపాటు ఒక మంచి పనిచేశామని సంతృప్తి కూడా దక్కనుంది. -
బ్లడ్ డొనేట్ చేయనందుకు దాడి చేశారు
కటక్: రక్త దానం చేయడానికి నిరాకరించినందుకు ఓ మైనర్ బాలుడిపై బిజు జనతాదళ్ (బీజేడీ) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఒడిశాలోని కటక్ లో అధికారపార్టీ ఎమ్మెల్యే శనివారం రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేట్ చేయడానికి కాలేజీ నుంచి కొంత మంది విద్యార్థులను బీజేడీ కార్యకర్తలు బలవంతంగా మోటార్ బైక్ పై తీసుకెళ్లారు. ఇందులో ఒక మైనర్ విద్యార్థి రక్తం ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో బీజేడీ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. ఈ మేరకు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే ప్రవత్ బిశ్వాల్ ను ప్రశ్నించగా తాము ఎవరినీ బలవంతంగా రక్తదానం చేయడానికి పిలువలేదని తెలిపారు. -
ఇక 'గే'లూ రక్తదానం చేయొచ్చు
వాషింగ్టన్: 'గే'లు, బై సెక్సువల్స్ రక్తదానం చేయకూడదంటూ అమెరికాలో గత 32ఏళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఫెడరల్ హెల్త్ అధికారులు ఎత్తివేశారు. అయితే రక్తదానం చేసేవారిపై ఉండే ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రక్తాన్ని పరీక్షించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున గేల రక్తదానంపై నిషేధం కొనసాగించడం అర్థరహితమని ఫుడ్ అండ్ డ్రగ్ యంత్రాంగం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కుల నుంచి విరాళాలు కూడా సేకరించరాదనే నిబంధనను కూడా ఫెడరల్ అధికారులు సమీక్షిస్తున్నారు. ఇలాంటి నిషేధం ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో కూడా ఉంది. -
ఆ ముగ్గురిలో.. హరి బతికే ఉన్నాడు..
అతను లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలుండాలని.. కొందరికైనా ప్రాణ దానం చేసి.. వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ కుటుంబ సభ్యులు భావించారు. మనస్ఫూర్తిగా గట్టి నిర్ణయం తీసుకున్నారు. పరోపకారార్థం ఇదం శరీరం.. అనే నానుడిని నిజం చేస్తూ.. తమ కుటుంబ సభ్యుడి మృతదేహం నుంచి అవయవాలను మ్రుగ్గురికి దానం చేసి తమ త్యాగాన్ని చాటుకున్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి.. గట్టి మేల్ తలపెట్టవోయ్.. అన్న మాటలకు వాస్తవ రూపమిచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన తగ్గువారిపల్లెకు చెందిన హరికృష్ణమనాయుడు అవయవాలను ఆయన కుటుంబ సభ్యుల ఆంగీకారం మేరకు వేలూరు సీఎంసీ ఆస్పత్రి నుంచి చెన్నైకు తరలించారు. బంగారుపాళెం: వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందిన వ్యాపారి హరికృష్ణమనాయుడు(55) అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. అతని గుండె, కిడ్నీలను వేలూరు నుంచి చెన్నైకి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. బం గారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెకు చెందిన హరికృష్ణమనాయుడు గత నెల 28న బంగారుపాళెం-అరగొండ రహదారి ఎంపీడీవో కార్యాలయం సమీపం లో మోటారు సైకిల్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది.ఈ ప్రమాదంలో తీవ్రంగా ఆయనతో పాటు అదే గ్రామానికి చెందిన సరోజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విష మంగా ఉండటంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు హరికృష్ణమ నాయుడుకు బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన మృతి అనంతరం అతని అవయవాలు దానం చేసేందుకు ముం దుకొచ్చారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు అవయవాలను సేకరించారు. గుండెను చెన్నైలోని మలర్ ఆసుపత్రికి, ఒక కిడ్నీని మియట్ ఆసుపత్రికి, మరొక కిడ్నీని గునాపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీం తో శుక్రవారం ఉదయం 9.25 గంట లకు వేర్వేరు అంబులెన్స్ ద్వారా అవయవాలను చెన్నైకి తరలించారు. అవయవాలను తీసుకెళ్లే సమయంలో ఎ లాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా వేలూ రు నుంచి చెన్నై కార్పొరేషన్‌లోని ఆసుపత్రి వరకు అంబులెన్స్‌లకు ముందుగా పెలైట్ వాహనాలు వెళ్లడంతో ఉదయం 11.10 గంటలకు బయలుదేరిన అంబులెన్సులు చెన్నైకి 1.45 గంటల సమయంలోనే చెన్నై ఆసుపత్రికి చేరాయి. అనంతరం మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి గుండెను అమర్చారు. అదే విధంగా రెండు కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులకు అందజేశారు. అలాగే కళ్లు, లివర్‌ను సీఎంసీ ఆసుపత్రికి దానంగా అందజేశారు. అవయవాలు దానంగా పొందిన కుటుంబ సభ్యులు.. హరికృష్ణమనాయుడు కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇతని భార్య రాణియమ్మ. కుమార్తె జాన్సీప్రియ. ఈమె పుదుచ్చేరి జిప్మర్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తోంది. కుమారుడు అజయ్ విదేశాల్లో ఇంజినీర్‌గా పని చే స్తున్నాడు. -
రక్తదానం చేసి ఆదుకోండి
ఖాట్మాండూ: రక్తదానం చేసి భూకంప క్షతగాత్రులను ఆదుకోవాలని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కోయిరాల అన్నారు. ప్రజల రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని విన్నవించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. క్షతగాత్రులతో నేపాల్ లోని ఆస్పత్రులు నిండిపోయాయి. ఆస్పత్రులకు తీసుకువస్తున్న వారిని బయటే ఉంచి చికిత్స అందజేస్తున్నారు. శనివారం నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల 2200 మందికిపైగా మరణించారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. -
పసుం పొన్ ముత్తు రామలింగం దేవర్ జయంతి
సాక్షి, చెన్నై : పసుం పొన్ ముత్తు రామలింగం దేవర్ జయంతిని దక్షిణాది జిల్లాల్లోని వాడవాడలా నిర్వహించారు. ముక్కుళత్తూరు సామాజిక వర్గం ప్రజలు, రాజకీయ నాయకుల నేతృత్వంలో కార్యక్రమాలు జరిగారుు. పాల బిందెలతో ఊరేగింపులు నిర్వహించారు. అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రామనాథపురం జిల్లా కౌముదిలోని దేవర్ స్మారక కేంద్రాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో ముస్తాబు చేశారు. బుధవారం వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రుల నివాళి దేవర్ స్మారక ప్రదేశంలో తొలుత వేడుకల నిర్వహణ కమిటీ నివాళులర్పించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు వైద్యలింగం, సెల్లూరు కె.రాజు, కామరాజ్, జిల్లా అధికారులు పుష్పాంజలి ఘటించారు. అలాగే డీఎంకే కోశాధికారి స్టాలిన్, ఎండీఎంకే అధినేత వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, పీఎంకే అధ్యక్షుడు జి.కె.మణి నివాళులర్పించారు. స్మారక కేంద్రానికి ఉదయం నుంచి రాత్రి వరకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖ్యంగా తిరునల్వేలి, శివగంగై, పుదుకోట్టై, మదురై, దిండుగల్, విరుదునగర్, తిరుచ్చి తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఐజీ అభయ్‌కుమార్ నేతృత్వంలో డీఐజీ అమల్‌రాజ్ పర్యవేక్షణలో ఏడు జిల్లాల ఎస్పీలు, ఐదు వేల మంది సిబ్బంది భద్రతా విధులు నిర్వహించారు. మానవరహిత విమానంలో కెమెరాల్ని అమర్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉద్రిక్తత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నా స్మారక ప్రదేశం వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవర్ జయంతిని పురస్కరించుకుని ఆ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దీంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. పోలీసుల అత్యుత్సాహం జనానికి ఆగ్రహం తెప్పించింది. ఉదయం మంత్రుల బృందం నివాళులర్పించి బయటకు రాగానే వారికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. తమకో న్యాయం, మంత్రులకు మరో న్యాయమా అంటూ గర్జించారు. ఒకానొక సమయంలో మట్టి ముద్దలతో కూడిన రాళ్లను మంత్రుల వాహనాలపైకి విసిరారు. రాళ్ల వర్షం కురవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గట్టి భద్రత మధ్య అక్కడి నుంచి మంత్రుల్ని పంపేశారు. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే పని గట్టుకుని రాళ్లు విసిరిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నైలో ఇలా అన్నాసాలైలోని నందనం సిగ్నల్ వద్ద ఉన్న దేవర్ విగ్రహాన్ని పలు రకాల పువ్వులతో అలంకరించారు. అక్కడ దేవర్ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జయలలిత ఉదయం నివాళులర్పించారు. అనంతరం ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, విద్యుత్‌శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్, అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ తదితరులు నివాళులర్పించారు. అలాగే డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, టీకేఎస్ ఇళంగోవన్, దక్షిణ చెన్నై పార్టీ కార్యదర్శి అన్భళగన్, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు తంగబాలు, కుమరి ఆనందన్, ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసర్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇలగణేషన్, ఉపాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, ఎస్ఎంకే ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణ, లక్ష్య డీఎంకే నేత, నటుడు టి.రాజేంద్రన్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. చెన్నైలోని డీఎండీకే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయకాంత్ నివాళులర్పించారు. -
రక్తదానమూ.. ఆరోగ్యకరమే..
ఒక వ్యక్తి ఆహారం లేక పోయినా కొన్ని రోజులపాటు జీవించగలడు. ఏ కారణాల వల్ల అయినా రక్తం కోల్పోయిన వ్యక్తికి కొన్ని గంటల వ్యవధిలో అవసరమైన రక్తం ఎక్కించక పోతే ప్రాణాలు కోల్పోతాడు. అటువంటి వారికి మనం స్వచ్ఛందంగా చేసిన రక్తదానమే పునర్జన్మను ఇస్తుంది. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంతోపాటు, రక్తదాతలు ఆరోగ్యకరంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు 1975 నుంచి ఏటా అక్టోబరు ఒకటో తేదీని జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.. విజయవాడ, న్యూస్‌లైన్ : వైద్య విజ్ఞాన రంగం ఎంత అభివృద్ధి చెందినా రక్తానికి ప్రత్యామ్నాయం గానీ, కృత్రిమంగా తయారు చేసే పక్రియను కనుగొనలేకపోయారు. ఒకరు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే మరొకరికి జీవితాన్ని ప్రసాదించవచ్చు. జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకని పరిస్థితి నెలకొంది. ఏటా జిల్లాలో 60 వేల నుంచి 65 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుండగా, వాటిలో 75 శాతం వరకూ స్వచ్ఛంద రక్తదానం ద్వారా సేకరిస్తున్నారు. మిగిలిన 25 శాతాన్ని రిప్లేస్మెంట్ ద్వారా సేకరిస్తున్నారు. రక్తదాతల్లో 95 శాతం మంది పురుషులు ఉండగా, కేవలం 5 శాతం మంది మాత్రమే మహిళలు రక్తదానం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వరకు బ్లడ్ బ్యాంకులు ఉండగా, వాటి ద్వారా 2012-13 ఆర్థిక సంవత్సరంలో 60,417 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో నగరంలోని లయన్స్ డిస్ట్రిక్ట్ బ్లడ్ బ్యాంకు 20 వేల యూనిట్లు, రెడ్‌క్రాస్ 6,542, చైతన్య బ్లడ్ బ్యాంకు 3,500 యూనిట్లు, ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో 2,475 యూనిట్లు సేకరించాయి. మరో నాలుగు బ్లడ్ బ్యాంకుల నుంచి 18 వేల వరకు సేకరించారు. మచిలీపట్నంలోని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకులో 1,400, ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో 8,500 యూనిట్లు సేకరించారు. అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంకుల్లో కొన్ని గ్రూపుల రక్తం దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తక్కువ మందిలో ఉండే ఏబీ పాజిటివ్, ఏబీ నెగటివ్ గ్రూపుల రక్తం కోసం రోగుల బంధువులు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిలో 50 మంది సకాలంలో రక్తం అందక మృత్యువాత పడుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర కొరత నగరంలోని ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు తక్కువగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ప్రమాదాలకు గురైన వారు తొలుత ప్రాణాపాయస్థితిలో ప్రభుత్వాస్పత్రికి వస్తుం టారు. వారికి సకాలంలో రక్తం ఎక్కించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆస్పత్రిలో ఏడాదికి 5,500 నుంచి 6,000 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతుండగా, కేవలం గత ఏడాది 2,475 యూనిట్లు మాత్రమే దాతల నుంచి సేకరించగలిగారు. రక్తదాతలు ముందుకు వస్తున్నప్పటికీ బ్లడ్ బ్యాంకుకు పూర్తిస్థాయి మెడికల్ ఆఫీసర్ లేకపోవడం, శిబిరాల నిర్వాహణకు బడ్జెట్ కొరత కారణంగా రక్తం కొరత ఏర్పడుతోంది. గతేడాది ప్రభుత్వాస్పత్రి అంబులెన్స్‌కు ఇంధనం కూడా లేకవడంతో కేవలం ఐదు క్యాంపులు మాత్రమే నిర్వహించి 325 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. మిగిలిన 2,150 యూనిట్లను దాతలే ఆస్పత్రికి వచ్చి ఇవ్వడం విశేషం. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటంతో తీవ్ర రక్తహీనతతో ప్రసవం కోసం వచ్చిన మహిళల బంధువులు రక్తం కోసం ఇతర బ్లడ్ బ్యాంకులకు అర్ధరాత్రిళ్లు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొందని సిబ్బందే చెబుతున్నారు. రక్తదానం ఎవరు చేయవచ్చంటే.. ఆరోగ్య వంతులైన 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు వారు రక్తదానం చేయవచ్చు. 50 కిలోల బరువు పైబడి ఉన్నవారు తమ శారీరక బరువు కిలోగ్రాముకి 8 మిల్లీ లీటర్ల రక్తాన్ని దానం చేయవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒక యూనిట్ రక్తం దానం చేయడం వలన ఎటువంటి అనారోగ్యానికి గురికారు. అలా చేస్తే మరింత ఆరోగ్యకరంగా జీవించవ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తదానంపై భయాందోళన దేశ జనాభాల్లో 50 శాతం మంది రక్తదానం చేసేందుకు అర్హత ఉన్నా కేవలం ప్రతి వెయ్యి మందిలో నలుగురు మాత్రమే చేస్తున్నారు. ఇందుకు అనేక అపోహలతోపాటు, భయాందోళనలే కారణం. విద్యార్థులకు రక్తదానం చేయాలని ఉన్నా తల్లిదండ్రులు ఏమైనా అంటారేమోననే ఆందోళనతో ముందుకు రావడం లేదు. ఒకరికి వాడిన సూదులు మరొకరికి వాడతారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రక్తదానం విషయంలో అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. - డాక్టర్ మదన్మోహన్, రెడ్‌క్రాస్ మెడికల్ ఆఫీసర్ -
పంచాయతీ రాజ్ ఉద్యోగుల రక్తదానం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 50 మంది ఉద్యోగులు రక్తదానం చేసి రాష్ట్ర విభజనపై తమ నిరసనను తెలియజేశారు. కేంద్రం దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకె ళ్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గంగాధర్‌గౌడ్, జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీదేవి, ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌బషీర్, డివిజనల్ పంచాయతీ అధికారి కృష్ణమోహన్, కేఎల్ నరశింహారావు, శరత్, సంఘ చైర్మన్ రాజశేఖర్, కార్యదర్శి శ్యామ్, రెడ్ క్రాస్ డాక్టర్ చలమయ్య తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఉద్యోగుల నిరసన రాష్ట్ర విభజన నిర్ణయాన్ని, ప్రభుత్వం జీతమివ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ కార్పొరేషన్ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. స్థానిక చర్చి సెంటర్లో ఉద్యోగులంతా ఎండుగడ్డి తింటూ నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఇప్పటికైనా మారాలన్నారు. వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులతో భారీ మానవహారం రాష్ట్ర మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక పీవీఆర్ స్కూల్ ఆవరణలో విద్యార్థులతో భారీ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు, జిల్లా అధ్యక్షుడు జాలారావు, కార్యదర్శి బ్రహ్మం, కోశాధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.