ఇక 'గే'లూ రక్తదానం చేయొచ్చు
వాషింగ్టన్: 'గే'లు, బై సెక్సువల్స్ రక్తదానం చేయకూడదంటూ అమెరికాలో గత 32ఏళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఫెడరల్ హెల్త్ అధికారులు ఎత్తివేశారు. అయితే రక్తదానం చేసేవారిపై ఉండే ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రక్తాన్ని పరీక్షించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున గేల రక్తదానంపై నిషేధం కొనసాగించడం అర్థరహితమని ఫుడ్ అండ్ డ్రగ్ యంత్రాంగం స్పష్టం చేసింది.
స్వలింగ సంపర్కుల నుంచి విరాళాలు కూడా సేకరించరాదనే నిబంధనను కూడా ఫెడరల్ అధికారులు సమీక్షిస్తున్నారు. ఇలాంటి నిషేధం ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో కూడా ఉంది.