రక్తదానం చేసి ఆదుకోండి
ఖాట్మాండూ: రక్తదానం చేసి భూకంప క్షతగాత్రులను ఆదుకోవాలని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కోయిరాల అన్నారు. ప్రజల రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని విన్నవించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. క్షతగాత్రులతో నేపాల్ లోని ఆస్పత్రులు నిండిపోయాయి. ఆస్పత్రులకు తీసుకువస్తున్న వారిని బయటే ఉంచి చికిత్స అందజేస్తున్నారు. శనివారం నేపాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల 2200 మందికిపైగా మరణించారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు.