
యశవంతపుర: భార్య వేధింపులతో విసిగి వేసారిన ఓ కాంట్రాక్టర్ గోవాలో ఎంజాయ్ చేసేందుకు లక్షల రూపాయల నగదుతో వెళ్తూ దారి తప్పి తనిఖీ అధికారుల బారినపడ్డాడు. వివరాలు.. బెళగావి చెక్‌పోస్ట్‌లో ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన కారును సోదా చేశారు. అందులో రూ.28 లక్షల నగదు లభ్యమైంది. ఆరా తీయగా తాను ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టర్‌నని పేర్కొన్నాడు.
ఇంత పెద్దమొత్తంలో నగదును ఎందుకు తీసుకెళుతున్నట్లు ప్రశ్నించగా భార్య పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఎంజాయ్ చేయటానికి గోవాకు వెళుతున్నట్లు తెలిపారు. అన్‌లైన్‌లో డబ్బు పంపితే భార్యకు తెలుస్తుందనే భయంతో నగదు తీసుకొని వెళుతున్నట్లు అంగీకరించాడు. గూగుల్ మ్యాప్ ఆధారంగా గోవా వెళ్తుండగా పొరపాటున బెళగావి రూట్‌లో వచ్చినట్లు తెలిపాడు. బెళగావి మార్కెట్ పోలీసులు నగదు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment