
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక బీఎస్‌ఎఫ్ సైనికుడు, అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందారు. బుధవారం విజయపుర జిల్లా నిడగుంది పట్టణంలో ద్విచక్ర వాహనానికి లారీ ఢీకొనడంతో బీఎస్‌ఎఫ్ సైనికుడు మౌనేష్ రాథోడ్(35), అదే సమయంలో లారీకి అంబులెన్స్ ఢీకొనడంతో డ్రైవర్ రితీష్(34) అనే ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనం, అంబులెన్స్‌ను ఒకే లారీ దూసుకుని వచ్చి ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. గుజరాత్‌లో పని చేస్తున్న బీఎస్‌ఎఫ్ సైనికుడు సెలవులు ఉండటంతో సొంత ఊరుకు రాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బీఎస్‌ఎఫ్ సైనికుడు, అంబులెన్స్
డ్రైవర్ దుర్మరణం